
WWDC 2025: ఐఫోన్‌లో మేధస్సు రెట్టింపు.. డెవలపర్లకు AI ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేసిన ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ మరో భారీ అడుగు వేసింది. వార్షిక WWDC 2025 (వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) ఈవెంట్‌లో భాగంగా 'Foundation Models' పేరుతో ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. దీనివల్ల డెవలపర్లు యాపిల్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఆన్-డివైస్, ఆఫ్‌లైన్‌లోనూ వినియోగించుకోవచ్చు. ఈ ప్రకటనను యాపిల్ VP ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ 'క్రెగ్ ఫెడెరిఘి' చేశారు.
Details
మూడు లైన్ల కోడ్‌తో ఏఐ శక్తి..!
యాపిల్ స్వంతంగా రూపొందించిన 'Apple Intelligence' మోడళ్లను ఇకపై డెవలపర్లు ఉపయోగించుకోగలుగుతారు. ఇవి iOSలోని పలు స్మార్ట్ ఫీచర్లకు బేస్‌గా పనిచేస్తున్న మోడల్సే. నేటివుగా Swift భాషకు అనుకూలంగా ఉండే ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా, కేవలం మూడు లైన్ల కోడ్‌తో యాపిల్ ఏఐ సామర్థ్యాన్ని యాప్స్‌లోకి తీసుకురావచ్చని యాపిల్ తెలిపింది. Day One, AllTrails మొదటి అడుగులు ఇప్పటికే కొన్ని ప్రముఖ యాప్స్ ఈ ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుతున్నాయి. Automattic యాజమాన్యంలో ఉన్న Day One జర్నలింగ్ యాప్, అలాగే AllTrails అనే మ్యాపింగ్ యాప్ దీని ప్రయోజనాలను వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా గైడెడ్ జనరేషన్, టూల్ కాలింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో భాగమవుతాయని యాపిల్ తెలిపింది.
Details
డెవలపర్లకు యాపిల్ AI మోడల్ యాక్సెస్
Foundation Models ఫ్రేమ్‌వర్క్‌కి తోడు, యాపిల్ తన స్వంతంగా అభివృద్ధి చేసిన ఫౌండేషన్ ఏఐ మోడల్‌ను కూడా తృతీయ పక్ష డెవలపర్లకు అందించనుంది. ఇది Apple Intelligenceలోని అనేక ఫీచర్లకు బేస్‌గా పనిచేస్తోంది. ఇందులో భాగంగా "Liquid Glass" డిజైన్‌తో కొత్తగా రూపొందించిన OS కూడా విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా పాక్షికంగా పారదర్శకమైన ఐకాన్‌లు, మెనూలు వుంటాయి. త్వరలో బీటా వెర్షన్ విడుదల Foundation Models ఫ్రేమ్‌వర్క్‌ను ప్రస్తుతానికి 'Apple Developer Program' సభ్యులు పరీక్షించవచ్చు. కాగా జులై నెలలో పబ్లిక్ బీటా విడుదల కానుంది.