మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.
బద్రీ(BADRI), మ్యాథ్‌జీపీటీ((MathGPT), టీచర్‌జీటీపీ(TeacherGPT) పేరుతో మూడు నూతన బోధన మోడళ్లను ఆవిష్కరించింది.
విద్యార్థులకు వ్యక్తిగత అనుభవాలతో కూడిన భోధనతోపాటు ప్రభావవంతమైన అభ్యాస అనుభవాలను అందించడంతోపాటు అభ్యాసాన్ని పునర్నిర్మించేందుకు ఈ కొత్త నమూనాలు ఉపయోగపడుతాయని బైజూస్ తెలిపింది.
BADRI అనేది ఒక ప్రిడిక్టివ్ AI మోడల్. విద్యార్థుల సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడంలో ఎప్పుడు తడబడతారో గుర్తించడానికి తోడ్పడుతుంది.ఈ మోడల్ ఏదైనా గుర్తించిన సమస్యలకు ముందస్తుగా సిఫార్సులను అందిస్తుంది.
బైజూల్
విద్యార్థుల ఆసక్తుల మేళవింపుతో బోధన
MathGPT అనే మోడల్ త్రికోణమితితో పాటు సంక్లిష్ట గణిత సవాళ్లకు అత్యంత కచ్చితమైన పరిష్కారాలను అందించడానికి ఉపయోగపడుతుంది.
మూడో మోడల్ TeacherGPT అనేది AI పవర్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకాలను అందిస్తుంది. వారి ప్రతిస్పందనలను కూడా గ్రేడింగ్ చేస్తుంది.
బోధనను మరింత ఆకట్టుకునేలా చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది. విద్యార్థుల ఆసక్తుల మేళవింపుతో ఈ ఏఐ మోడల్ బోధన చేస్తుంది. ఉదాహరణకు క్రికెట్ పట్ల మక్కువ ఉన్న విద్యార్థి కోసం TeacherGPT మోడల్, ఆ సబ్జక్ట్‌ను క్రికెట్‌తో లింక్ పెట్టి బోధిస్తుంది.
తద్వారా విద్యార్థికి తర్వగా అర్థం అవుతుందని బైజూస్ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది.