Page Loader
Elon Musk: 'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్
'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్

Elon Musk: 'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్‌-X ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ విశేషమైన మైలురాయిని చేరుకున్నారు. గురువారం నాటికి మస్క్‌ ఫాలోవ‌ర్ల సంఖ్య 200 మిలియన్లకు పెరిగింది,తద్వారా ఈ మార్క్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే,మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను 44బిలియన్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేశారు. మస్క్ తర్వాత 'ఎక్స్‌'లో అత్యధిక ఫాలోవ‌ర్లు ఉన్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు),ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(113.2 మిలియన్లు)ప్రథానంగా నిలుస్తారు. ప్రసిద్ధ గాయకుడు జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉండగా,పాప్ సింగర్ రిహన్నా 108.4 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

వివరాలు 

100 మిలియన్ల ఫాలోవ‌ర్ల మార్కును దాటిన నరేంద్ర మోదీ  

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే 100 మిలియన్ల ఫాలోవ‌ర్ల మార్కును దాటారు, దీనిని మస్క్ కూడా ప్రశంసించారు. ప్రస్తుతం మోదీ 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. తాజాగా మస్క్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం'ఎక్స్‌'కి 600 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు (MAUs), సుమారు 300 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు(DAUs)ఉన్నారు. ఇదే సందర్భంలో మస్క్'ఎక్స్‌' గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు."ఎక్స్‌ అనేది భూమికి సంబంధించిన గ్రూప్ చాట్" అని పేర్కొన్నారు. అయితే, ఈ వారం ప్రారంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఫిడిలిటీ తమ ఎక్స్‌లోని వాటా విలువను 78.7 శాతం తగ్గించిందని ప్రకటించింది, తద్వారా ప్లాట్‌ఫారమ్ విలువ కేవలం 9.4 బిలియన్ డాలర్లుగా మారింది.