Loading...
Grok Bots: గ్రోక్‌ బాట్స్‌తో కంపెనీ నిర్వహణ.. మస్క్‌ ఆసక్తికర ప్రతిపాదన
గ్రోక్‌ బాట్స్‌తో కంపెనీ నిర్వహణ.. మస్క్‌ ఆసక్తికర ప్రతిపాదన

Grok Bots: గ్రోక్‌ బాట్స్‌తో కంపెనీ నిర్వహణ.. మస్క్‌ ఆసక్తికర ప్రతిపాదన

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరిశోధన చేస్తారు. ఇంకొకరు సమాచారాన్ని పరిశీలిస్తారు. ఇదే విధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రపంచంలోనూ అమలు చేయవచ్చని టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ చెబుతున్నారు. గ్రోక్‌ బాట్స్‌ను సాధారణ చాట్‌బాట్‌లుగా కాకుండా, కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఏఐ బాట్‌కు ఒక ప్రత్యేక బాధ్యత అప్పగించి, వాటన్నింటినీ పర్యవేక్షించేందుకు మరో ఏఐ మేనేజర్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆయన ప్రతిపాదన.

Details

ఒక్కో ఏఐ బాట్‌కు ఒక్కో బాధ్యత

గ్రోక్‌ బాట్స్‌ను ఉపయోగించేటప్పుడు ఒకే బాట్‌కు అన్ని పనులు అప్పగించకూడదని మస్క్‌ సూచిస్తున్నారు.

దానికి బదులుగా ప్రతి బాట్‌కు ఒక నిర్దిష్టమైన పని కేటాయించాలి. ఉదాహరణకు ఒక బాట్‌ పరిశోధన చేయడం, మరోటి సోషల్‌ మీడియా నిర్వహించడం, ఇంకొకటి సమాచారాన్ని ధ్రువీకరించడం వంటి బాధ్యతలు తీసుకోవచ్చు.

వీటన్నింటి పనితీరును పర్యవేక్షిస్తూ, అవసరమైన సమాచారాన్ని ఒకదానితో మరొకటి పంచుకునేలా ఏఐ మేనేజర్‌ బాట్‌ పనిచేస్తుంది.

మనుషుల మాదిరిగానే ఏఐ బాట్‌లకు కూడా పరిమితమైన బాధ్యతలు ఇవ్వడం వల్ల పనిలో స్పష్టత, సమన్వయం ఉంటాయని మస్క్‌ అభిప్రాయం.

Details

సెప్టెంబర్‌ నుంచి మస్క్‌ ఇదే ఆలోచన

గ్రోక్‌ బాట్స్‌తో బృందాలుగా పనిచేయించాలన్న ఆలోచనను మస్క్‌ గతంలోనూ ప్రస్తావించారు.

సెప్టెంబర్‌ 29న ఈ ఏఐ బాట్‌లు ఒక బృందంలా కలిసి పనిచేయగలవని వెల్లడించారు.

నవంబర్‌ 19న తన ఆలోచనను మరింత విస్తరిస్తూ.. గ్రోక్‌ బాట్స్‌తోనే ఒక పూర్తి కంపెనీని ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు.

అంతేకాదు, ఒక్కో గ్రోక్‌ బాట్‌ను తెలివైన ఉద్యోగిలా భావించాలని సూచించారు.

అంటే భవిష్యత్తులో ఒక సంస్థలోని కొన్ని పనులను మనుషులతో పాటు ప్రత్యేక బాధ్యతలు కలిగిన ఏఐ ఏజెంట్లు కూడా నిర్వహించే అవకాశం ఉందన్నమాట.

ADVERTISEMENT

Details

సాధారణ చాట్‌బాట్‌లకు భిన్నంగా గ్రోక్‌ బాట్

గ్రోక్‌ బాట్‌ అనేది మనం ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇచ్చే సాధారణ చాట్‌బాట్‌ మాత్రమే కాదు.

2026 ఆగస్టులో బీటా వెర్షన్‌గా ప్రారంభమైన ఈ వ్యవస్థ స్వతంత్రంగా పనులు చేయగల ఏఐ ఏజెంట్లపై ఆధారపడి ఉంటుంది.

వీటికి సొంత క్లౌడ్‌ కంప్యూటర్లను ఉపయోగించే సామర్థ్యం ఉంది. వెబ్‌సైట్లు, యాప్‌లతో పరస్పర చర్యలు జరపడం, గత సెషన్లలోని సమాచారాన్ని గుర్తుంచుకోవడం, ఒకదానితో ఒకటి అనుసంధానమైన అనేక దశల పనులను పూర్తి చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఈ సామర్థ్యాలకు ప్రత్యేక బాట్‌ల బృందాన్ని జోడిస్తే, ఒక పెద్ద పనిని చిన్న చిన్న బాధ్యతలుగా విభజించి పూర్తి చేయవచ్చు.

ADVERTISEMENT

Details

ఇప్పటికే బాట్‌లతో బృందాలు ఏర్పాటు చేస్తున్న యూజర్లు

మస్క్‌ సూచనలను కొందరు యూజర్లు ఇప్పటికే ఆచరణలో పెడుతున్నారు.

డజన్ల కొద్దీ ఏఐ బాట్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో దానికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారు.

ఒక బాట్‌ను చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమిస్తే.. మిగిలినవి ఫ్యాక్ట్‌ చెకింగ్‌, సోషల్‌ మీడియా, పరిశోధన, వెబ్‌సైట్‌ నిర్వహణ వంటి పనులు చూస్తున్నాయి.

ఓ యూజర్‌ అయితే ప్రముఖ టీవీ సిరీస్‌ 'ది ఆఫీస్‌' పాత్రల పేర్లను తన బాట్‌లకు పెట్టుకున్నారు.

మైఖేల్‌ స్కాట్‌కు మేనేజర్‌ బాధ్యతలు, డ్వైట్‌కు ఫ్యాక్ట్‌ చెకింగ్‌ పని అప్పగించారు. ఈ ప్రయోగాలు ఏఐ ఏజెంట్లను వ్యక్తిగత పనులకే కాకుండా, చిన్న సంస్థల నిర్వహణలోనూ ఉపయోగించుకునే అవకాశాలను చూపిస్తున్నాయి.

ADVERTISEMENT