Elon Musk: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్ ...సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ నెట్‌వర్క్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లోకి వెళ్లగానే మొబైల్ సిగ్నల్ తగ్గిపోవడం.. ముఖ్యంగా మందమైన పైకప్పులు, మెటల్ రూఫ్ ఉన్న భవనాల్లో నెట్‌వర్క్ మాయం కావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. దీనికి పరిష్కారం చూపేందుకు స్పేస్ ఎక్స్ కొత్త ప్లాన్‌తో ముందుకొస్తోంది. పైకప్పుపై ఏర్పాటు చేసుకునే చిన్న సెల్యులార్ టవర్‌ను కంపెనీ డిజైన్ పూర్తి చేసిందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. స్టార్‌లింక్ ఉపగ్రహాల నుంచి సిగ్నల్ నేరుగా అందని భవనాల్లో ఈ మినీ టవర్ మొబైల్ కవరేజీని మెరుగుపరచనుంది.
Details
2027లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశం
మస్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చిన్న సెల్ టవర్లు 2027లో ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ డైరెక్ట్-టు-సెల్ V2 ఉపగ్రహాల వ్యవస్థను కూడా సిద్ధం చేస్తోంది.
వచ్చే ఏడాది ప్రారంభించనున్న ఈ కొత్త ఉపగ్రహ సమూహం ద్వారా బ్యాండ్‌విడ్త్ దాదాపు 40 రెట్లు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్‌కు భవనాల పైకప్పులు అడ్డుగా మారే సమస్య మాత్రం మిగిలింది. దాన్ని అధిగమించేందుకే ఈ మినీ సెల్ టవర్ ఆలోచన తెరపైకి వచ్చింది.
Details
స్టార్‌లింక్ డిష్‌లా పైకప్పుపైనే ఏర్పాటు
మస్క్ చెప్పిన ప్రకారం, ఈ పరికరం చూడటానికి స్టార్‌లింక్ డిష్‌లా ఉండొచ్చు.
పైకప్పుపై ఏర్పాటు చేసి, ఉపగ్రహ కనెక్టివిటీని స్థానిక మొబైల్ సిగ్నల్‌తో కలిపే విధంగా పనిచేయనుంది.
చిన్న పరిమాణంలో, తక్కువ విద్యుత్‌తో పనిచేసే సెల్యులార్ బేస్ స్టేషన్లను ఉపయోగించాలన్న ఆలోచన స్పేస్‌ఎక్స్‌కు ఇప్పటికే ఉందని కంపెనీ అధ్యక్షురాలు గ్విన్ షాట్‌వెల్ కూడా గతంలో తెలిపారు.
అవసరాన్ని బట్టి వీటిని స్టార్‌లింక్ టెర్మినల్స్‌తో కలిపి ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని మస్క్ చెప్పారు.
Details
టెలికాం కంపెనీలకు పోటీనా.. అసలు టార్గెట్ ఏంటి?
స్పేస్‌ఎక్స్ ఇప్పటికే మొబైల్ కనెక్టివిటీ కోసం వైర్‌లెస్ స్పెక్ట్రమ్‌పై భారీగా దృష్టి పెట్టింది.
2025లో ఎకోడార్‌తో 17 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకోగా, ఈ ఏడాది మరో 8 బిలియన్ డాలర్ల విలువైన లో-బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలుకు ముందడుగు వేసింది.
స్టార్‌లింక్ ఉపగ్రహాలు, వైర్‌లెస్ స్పెక్ట్రమ్, మినీ సెల్ టవర్లను కలిపి హైబ్రిడ్ నెట్‌వర్క్ రూపొందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
అయితే దీని వల్ల AT&T, Verizon వంటి టెలికాం సంస్థలు పూర్తిగా కనుమరుగవుతాయని మస్క్ భావించడం లేదు.
భవిష్యత్తులో ఏఐ, రోబోట్లు భారీగా డేటా వినియోగించడంతో బ్యాండ్‌విడ్త్‌కు డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.