ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు. OpenAI ChatGPTకి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశోధన ల్యాబ్‌ను రూపొందించడం గురించి ఎలోన్ మస్క్ AI పరిశోధకులను సంప్రదించారు. మస్క్ ఇటీవల ఆల్ఫాబెట్ డీప్‌మైండ్ AI యూనిట్ నుండి బయటకు వచ్చిన పరిశోధకుడు ఇగోర్ బాబుష్కిన్ ను రిక్రూట్ చేస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. 2015లో లాభాపేక్ష లేని స్టార్టప్‌గా సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్ సామ్ ఆల్ట్‌మాన్‌తో కలిసి OpenAIని స్థాపించిన మస్క్, 2018లో అందులో నుండి నిష్క్రమించారు.