LOADING...
IPhone 17 Sereis: ఫిజికల్ సిమ్ ట్రేకు ఎండ్ కార్డ్.. iPhone 17లో పెద్ద మార్పు!
ఫిజికల్ సిమ్ ట్రేకు ఎండ్ కార్డ్.. iPhone 17లో పెద్ద మార్పు!

IPhone 17 Sereis: ఫిజికల్ సిమ్ ట్రేకు ఎండ్ కార్డ్.. iPhone 17లో పెద్ద మార్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ 'Awe Dropping' ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేదికపైనే iPhone 17 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లాంచ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం, ఈసారి iPhone 17మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less) వేరియంట్‌లుగా ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని iPhone మోడల్స్ eSIM సపోర్ట్‌తో వస్తున్నాయి. అయితే iPhone 14నుంచి అమెరికా మోడల్స్‌లో ఫిజికల్ సిమ్ ట్రే లేకుండా లాంచ్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఇతర దేశాల్లో మాత్రం eSIM + ఫిజికల్ సిమ్ రెండూ అందుబాటులో ఉన్నాయి.

Details

యూరప్‌తో పాటు మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం

ఇప్పుడు ఆ పరిమితిని యూరప్‌తో పాటు మరిన్ని దేశాలకు విస్తరించనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆపిల్ మొదటిసారి iPhone 14 సిరీస్ (2022)లో అమెరికా మార్కెట్‌కే ఫిజికల్ సిమ్ స్లాట్ తొలగించింది. ఇక iPhone 17తో గ్లోబల్‌గా మార్పులు రావొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక eSIM వినియోగంలో లాభాలు కూడా ఉన్నాయి, సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రయోజనాల విషయానికి వస్తే మరింత సౌకర్యవంతమైన వినియోగం, అధిక భద్రతా ప్రమాణాలు, అవసరమైతే తక్షణమే డీయాక్టివేషన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మరోవైపు అన్ని ఫోన్లలో eSIM సపోర్ట్ లేకపోవడం, తరచుగా ఫోన్లు మార్చుకునే వారికి అసౌకర్యం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.