LOADING...
X post: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్‌.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్‌.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్

X post: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్‌.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య కారణంగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు తమ ఫీడ్‌లను రిఫ్రెష్ చేయడం, లింక్‌లను ఓపెన్ చేయడం వంటి కీలక సేవలను ఉపయోగించలేక ఇబ్బందులు పడ్డారు. అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ ప్రకారం సాయంత్రం నుంచి సమస్యలు క్రమంగా పెరిగాయి. రాత్రి 8:17గంటల సమయానికి భారతదేశంలో 1,200కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ సంఖ్య వేగంగా పెరిగి 8:30నాటికి 4,500దాటింది. అదే సమయంలో అమెరికాలో కూడా కేవలం 30 నిమిషాల్లో 14,000కు పైగా అవుటేజ్ నివేదికలు రావడం సమస్య తీవ్రతను సూచించింది. వినియోగదారుల ప్రకారం నోటిఫికేషన్‌లు అందుతున్నప్పటికీ, ప్రధాన ఫీడ్ మాత్రం లోడ్ కాలేదు.

Details

35నిమిషాల తర్వాత సేవల పునరుద్ధరణ

సుమారు 35నిమిషాల తర్వాత సేవలు క్రమంగా పునరుద్ధరించారు. అయితే ఈ సమస్యకు గల అసలు కారణాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సర్వర్ లోపాలు, సైబర్ దాడులు లేదా సిస్టమ్ అప్‌డేట్ల సమయంలో ఏర్పడే సాంకేతిక సమస్యలు దీనికి కారణం కావచ్చు. ఈఅంతరాయం మధ్యలో కూడా వినియోగదారులు సోషల్ మీడియాలో మీమ్స్‌తో సందడి చేశారు. మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఫన్నీ పోస్టులు షేర్ చేయగా, మరికొందరు హాస్యాస్పద వ్యాఖ్యలతో పరిస్థితిని సరదాగా మార్చారు. తాత్కాలికంగా జరిగిన ఈ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లపై ప్రభావం చూపింది. సోషల్ మీడియాపై ఆధారపడే సమాచార మార్పిడి, వ్యాపార కార్యకలాపాలు, ప్రజా చర్చలపై ఇలాంటి ఘటనలు ఎంతటి ప్రభావం చూపగలవో మరోసారి స్పష్టమైంది.

Advertisement