
ChatGPT: జీబ్లీ ఫిల్టర్‌కి విపరీతమైన క్రేజ్.. ఓపెన్ ఏఐ పరిమితులు విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
దీని వల్ల యూజర్లను ఆకర్షించేందుకు వివిధ సంస్థలు కొత్త మోడళ్లను, విపరీతమైన ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీలో (ChatGPT) జీబ్లీ (Ghibli) స్టైల్ ఫిల్టర్‌ను ప్రవేశపెట్టింది.
బాలీవుడ్‌లోని ఐకానిక్ రాజ్-సిమ్రాన్ ట్రైన్ సీన్ నుంచి, ట్రంప్‌పై హత్యాయత్నం వంటి వివిధ ఫొటోలకు యానిమేషన్ రూపాన్ని ఇచ్చే ఈ ఫిల్టర్ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
అయితే, వినియోగదారుల అధిక ఉపయోగం వల్ల జీపీయూ (GPU) వ్యవస్థపై భారీ భారం పడుతోందని, అందుకే దీనికి పరిమితి విధిస్తున్నామని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) పేర్కొన్నారు.
Details
జీబ్లీ స్టైల్ ఫిల్టర్‌కు అపారమైన ఆదరణ
వినియోగదారులు జీబ్లీ స్టైల్ ఫిల్టర్‌ను విపరీతంగా ఇష్టపడుతున్నారని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ఇది తమకు ఆనందకరమని, కానీ, అధిక వాడకం వల్ల జీపీయూ, సర్వర్‌లపై భారం పెరుగుతోందన్నారు.
ఈ కారణంగా పరిమితి విధించాల్సి వచ్చిందని, అయితే, త్వరలో చాట్‌జీపీటీ ఉచిత వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఇటీవల, ఓపెన్‌ఏఐ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఆవిష్కరించింది. శామ్ ఆల్ట్‌మన్ దీనిని అద్భుతమైన సాంకేతికతగా వర్ణించారు.
మునుపటి మోడళ్ల కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని, GPT-4o మోడల్ మరింత కచ్చితత్వంతో, సందర్భాన్ని అర్థం చేసుకునే విధంగా చిత్రాలను రూపొందించగలుగుతుందని పేర్కొన్నారు.
Details
కొత్త మోడల్ సామర్థ్యాలు, పరిమితులు
పూర్వం ఉన్న లిమిటేషన్ల కంటే పరిధిని పెంచారు.
నాన్-లాటిన్ భాషల్లో ప్రాంప్ట్ ఇస్తే, కొన్ని సందర్భాల్లో రెండరింగ్ ఇబ్బందులు ఉండొచ్చు.
సంక్లిష్టమైన చిత్రాలను క్రాప్ చేయడంలో కొన్నిసార్లు లోపాలు కనిపించొచ్చు.
ఈ సవాళ్లను త్వరలో పరిష్కరిస్తామని ఓపెన్‌ఏఐ ప్రకటించింది.
Details
జీబ్లీ స్టైల్ ఫిల్టర్‌ను ఉపయోగించిన వైట్‌హౌస్
చాట్‌జీపీటీలో జీబ్లీ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే, అన్ని వర్గాల వినియోగదారులు దీన్ని విపరీతంగా ఉపయోగించడం ప్రారంభించారు.
ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ కూడా ఈ ఫీచర్‌ను వినియోగించింది.
యూఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఇటీవల వర్జీనియాకు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారి ఫొటోను జీబ్లీ ఫిల్టర్ ద్వారా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఈ ఫీచర్ మరింత వైరల్‌గా మారింది.