Facebook: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో సాంకేతిక అంతరాయం నెలకొంది. దీంతో ఫేస్ బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ మెసెంజర్ (Facebook Messenger) వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీడ్ లోడ్ కాకపోవడం, లాగిన్ సమస్యలు తలెత్తడం, సందేశాలు పంపడంలో ఆటంకాలు ఏర్పడడం వంటి సమస్యలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయడంలో కూడా అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోంది.
వివరాలు
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు
'సైట్‌లో తలెత్తిన సమస్య కారణంగా మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేవు.
దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి' అనే సందేశం ప్రదర్శితమవుతోందని పలువురు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు చేస్తున్నారు.
ఈ అంతరాయం భారత్‌తో పాటు కెనడా, బ్రిటన్, తుర్కియే వంటి పలు దేశాల్లోనూ నమోదైనట్లు డౌన్‌డిటెక్టర్ (DownDetector) వెబ్‌సైట్ వెల్లడిస్తోంది.
అయితే ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలపై మెటా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.