First Lunar Eclipse of 2026: 2026 తొలి చంద్రగ్రహణం: భారత్‌లో ఎప్పుడు? ఎంతసేపు కనిపిస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
2026 సంవత్సరంలో తొలి గ్రహణం సమీపిస్తోంది. ఫిబ్రవరి 17న సంభవించే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే అనంతరం ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో దర్శనమివ్వనుంది. మరి ఈ చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? భారత్‌లో ఎంతసేపు కనిపిస్తుంది? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఈ ఏడాదిలో చోటుచేసుకోనున్న తొలి చంద్రగ్రహణం భారత్‌లో ఏ సమయానికి కనిపిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివరాలు
2026లో తొలి చంద్రగ్రహణం వివరాలు
2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించనుంది. ఇది మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం వ్యవధి 3 గంటలు 27 నిమిషాలు ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం పూర్తిగా ప్రారంభం నుంచి కనిపించదు. చంద్రోదయ సమయాన్ని అనుసరించి వివిధ నగరాల్లో ఇది దర్శనమిస్తుంది.
వివరాలు
ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనపడుతుందా?
ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో ఎక్కువ సమయం గ్రహణం కనిపించనుంది. ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లో మాత్రం కొద్దిసేపు మాత్రమే దర్శనమిస్తుంది. నగరాల వారీగా చూస్తే — ఇటానగర్‌లో సుమారు 1 గంట 40 నిమిషాలు, కోల్‌కతాలో దాదాపు 1 గంట 15 నిమిషాలు గ్రహణం కనిపిస్తుంది. లక్నోలో సుమారు 45 నిమిషాలు, ఢిల్లీలో దాదాపు 25 నిమిషాలు కనిపించనుంది. భోపాల్‌లో సుమారు 26 నిమిషాలు, చెన్నైలో 29 నిమిషాలు, ముంబైలో కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే దర్శనమిస్తుంది. పాట్నాలో సుమారు 1 గంట 3 నిమిషాల పాటు చంద్రగ్రహణం కనిపించనుంది.