Flipkart: ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ప్లస్ లాయల్టీ సభ్యుల కోసం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రత్యేక రివార్డు కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ఈ కొత్త ఆఫర్‌లో అర్హత సాధించిన వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా అందించనుంది. ఈ రివార్డు ప్రోగ్రామ్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఒకే క్యాలెండర్ నెలలో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నాలుగు ఆర్డర్లు పూర్తి చేసిన ప్లస్ సభ్యులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ అర్హత ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా చేసే కొనుగోళ్లకు వర్తిస్తుంది.
వివరాలు
30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్..
వినియోగదారు నాలుగో ఆర్డర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అందుబాటులోకి వస్తుంది.
తదుపరి నెలలో కూడా ఇదే విధంగా నాలుగు అర్హత కలిగిన ఆర్డర్లు పూర్తి చేస్తే మరోసారి ఈ ప్లాన్‌ను అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా ప్రతి నెలా నిర్ణీత షాపింగ్ పూర్తిచేస్తూ ఈ ప్రయోజనాన్ని నిరంతరం కొనసాగించవచ్చు.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కాని వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంది.
అయితే, అందుకోసం 12 నెలల వ్యవధిలో మొత్తం 15 ఆర్డర్లు పూర్తి చేసి ప్లస్ మెంబర్‌షిప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
వివరాలు
ఉచిత ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోండిలా..
అయితే, ఈ ఆఫర్‌లో లభించే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ను ఒకేసారి ఒక మొబైల్ లేదా ఒక టాబ్లెట్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు.
టీవీలో వీక్షించే అవకాశం ఉండదు. అలాగే, ఈ ప్లాన్‌ను ఇతర నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం కూడా ఉండదు.
ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే నెలలో నాలుగు అర్హత కలిగిన ఆర్డర్లు పూర్తి చేసిన తర్వాత Flipkart App → My Account → Plus Page → Netflix Page విభాగానికి వెళ్లాలి.
అక్కడ కనిపించే "Claim Now" ఎంపికపై క్లిక్ చేసి, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో నెట్‌ఫ్లిక్స్‌లో లాగిన్ అయితే ఉచిత ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.