Free Fire x Pushpa 2 event: ఆన్ లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో సందడి చేయనున్న 'పుష్పరాజ్'
థియేటర్లలో హీట్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2 సినిమా, ఇప్పుడు ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మాక్స్ లో కూడా సందడి చేయనుంది. ఈ రోజు నుండి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ పుష్ప 2 తో కలసి ప్రత్యేక ఈవెంట్లు, థీమ్ మిషన్లు, రివార్డులు అందిస్తోంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఫ్రీ ఫైర్ మ్యాక్స్ సంస్థ ఇటీవల విడుదలైన పుష్ప 2తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యంతో గేమ్‌లో కొత్త క్యారెక్టర్లు,ఎమోట్స్,థీమ్ ఆయుధాలు, ప్రత్యేక దుస్తులు, మరెన్నో గేమింగ్ ఎలిమెంట్లను ప్రవేశపెట్టింది. పుష్ప 2 ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే ఉత్సాహాన్ని గేమ్ అభిమానులకు అందించేందుకు ఈ ఈవెంట్ డిజైన్ చేయబడింది.
పవర్‌ఫుల్ డైలాగ్‌లు
డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 15 వరకు లైవ్‌లో ఉండే ఈ ఈవెంట్‌లో గేమర్స్ పుష్ప 2 థీమ్‌తో కూడిన మిషన్లను పూర్తి చేసి ప్రత్యేక బహుమతులను గెలుచుకోవచ్చు. అల్లు అర్జున్ పాత్ర పుష్ప రాజ్, సినిమా నేపథ్యం, "తగ్గేదేలే!" వంటి పవర్‌ఫుల్ డైలాగ్‌లు, ఆక్షన్ సీక్వెన్స్‌లు గేమ్‌లో సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో పుష్పకు సంబంధించిన గొడ్డలి, థీమ్ దుస్తులు, కొత్త ఆయుధ స్కిన్లు గేమ్‌కు ఆకర్షణీయతను జోడిస్తున్నాయి. పైగా, "ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్," "పుష్ప నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్" వంటి డైలాగ్‌లు కూడా వినిపిస్తాయి.
పుష్ప 2 ఈవెంట్‌లో అద్భుతమైన బహుమతులు
పుష్ప క్యారెక్టర్‌కు సంబంధించిన పుష్ప రాజ్ బండిల్, అందులోని షర్ట్, ప్యాంట్, హెయిర్ స్టైల్, బూట్లు వంటి అంశాలు పుష్ప 2లో అల్లు అర్జున్ స్టైలింగ్‌ను ప్రతిబింబిస్తాయి. అదనంగా, గరెనా సర్వైవల్ టాస్క్‌లు, బౌంటీ హంట్స్ వంటి కొత్త మిషన్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వీటితో ఆటగాళ్లు డబ్బు లేదా డైమండ్స్ ఖర్చు చేయకుండా ఉచితంగా ప్రత్యేక రివార్డులను గెలుచుకోగలరు. గరెనా ఇటీవల ఒబి 47 అప్డేట్ను కూడా విడుదల చేసింది, ఇందులో గేమ్‌కు మరిన్ని ఫీచర్లు, అప్‌డేట్స్, క్యారెక్టర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఈవెంట్లు, అప్‌డేట్లు, భాగస్వామ్యాలు గేమర్స్‌లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈ ప్రత్యేక పుష్ప 2 ఈవెంట్‌లో పాల్గొని అద్భుతమైన బహుమతులను గెలుచుకోండి.