LOADING...
Strange Sea Creatures: సముద్ర గర్భంలో విచిత్ర జీవుల ఆవిష్కరణ.. కొత్త జాతులతో శాస్త్రవేత్తల సంచలన పరిశోధనలు
కొత్త జాతులతో శాస్త్రవేత్తల సంచలన పరిశోధనలు

Strange Sea Creatures: సముద్ర గర్భంలో విచిత్ర జీవుల ఆవిష్కరణ.. కొత్త జాతులతో శాస్త్రవేత్తల సంచలన పరిశోధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

సముద్రం అనేక కోట్ల జీవరాశులకు నిలయంగా భావిస్తారు. అందుకే సముద్ర గర్భంలోని జీవ ప్రపంచంపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. గత ఏడాదిలో నిర్వహించిన సముద్ర అధ్యయనాల్లో మొత్తం 1,121 కొత్త జీవరాశులను పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఎన్నో ఆశ్చర్యకరమైన, అరుదైన జీవులు వెలుగులోకి వచ్చాయి. 85 దేశాలకు చెందిన వెయ్యికి పైగా పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తాజాగా ఈ సముద్ర జీవ గణన వివరాలను మంగళవారం విడుదల చేశారు. గత పరిశోధనలతో పోలిస్తే ఈసారి గుర్తించిన కొత్త జీవరాశుల సంఖ్య 54 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. నిప్పన్ ఫౌండేషన్, నెక్టాన్ ఓషియన్ సెన్సస్ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి.

వివరాలు 

2,700 అడుగుల లోతులో ఘోస్ట్ షార్క్ ఖిమేరా

జపాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలో సుమారు 2,600 అడుగుల లోతులో గాజు స్పాంజ్‌లో నివసించే ప్రత్యేక పురుగును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వెంట్రుకల్లాంటి నిర్మాణాలతో ఉండే బ్రిజిల్ పాలికేట్ జాతికి చెందింది. గాజులో ప్రధానంగా ఉండే సిలికాతో తయారైన వల ఆకారపు అస్థిపంజరం దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కారణంగా దీనికి "గాజు కోట పురుగు"అనే పేరు పెట్టారు. ఆస్ట్రేలియాలోని కోరల్ సీ మెరీన్ పార్కులో మరో అరుదైన జీవి కనిపించింది. ఘోస్ట్ షార్క్ ఖిమేరా పేరుతో గుర్తించిన ఈ జీవి సుమారు 2,700 అడుగుల లోతులో లభ్యమైంది. ఇది సొరచేపల కుటుంబానికి చెందినదే అయినప్పటికీ, సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితమే వేరైన జాతిగా మారిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వివరాలు 

అంగుళం పొడవున్న రిబ్బన్ పురుగు

తైమూర్ లెస్ట్ సముద్ర ప్రాంతంలో అంగుళం పొడవున్న రిబ్బన్ పురుగును గుర్తించారు. దీని శరీరంపై నారింజ రంగు చారలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ పురుగులు విడుదల చేసే విష పదార్థాలు అల్జీమర్స్, స్కిజోఫ్రినియా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయా అనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. దక్షిణ శాండ్‌విచ్ దీవుల ఉత్తర ప్రాంత సముద్ర గర్భంలో డెత్ బాల్ ఆకారంలో ఉన్న విచిత్ర జీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సుమారు 12 వేల అడుగుల లోతులో కనిపించాయి. వీటి శరీరంపై వెల్క్రో మాదిరిగా ఉండే కొక్కేలు ప్రత్యేక లక్షణంగా గుర్తించారు.

Advertisement

వివరాలు 

కొత్త జీవరాశిని శాస్త్రీయంగా ధృవీకరించి అధికారికంగా పేరు పెట్టడానికి 13.5 సంవత్సరాలు

ఇక దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని దక్షిణ శాండ్‌విచ్ దీవుల వద్ద కలం ఆకారంలో కనిపించే మరో జీవిని కూడా గుర్తించారు. ఈ జీవి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం జన్యు విశ్లేషణలు నిర్వహిస్తున్నారు. అయితే గుర్తించిన ఈ జీవరాశులన్నీ పూర్తిగా కొత్తవేనా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. సాధారణంగా ఒక కొత్త జీవరాశిని శాస్త్రీయంగా ధృవీకరించి అధికారికంగా పేరు పెట్టడానికి సగటున 13.5 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement