LOADING...
Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!
అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!

Subhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి.. మళ్లీ అడుగులు వేయడం నేర్చుకుంటున్న శుభాన్షు శుక్లా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవ‌ల విజయవంతంగా ముగిసిన అంతరిక్ష యాత్ర అనంత‌రం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మ‌ళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా జూన్ 25న చేపట్టిన ఆక్సియం-4 మిషన్‌లో ఆయన ఇతర ముగ్గురు సభ్యులతో కలిసి అంతరిక్షానికి వెళ్లారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుమారు 18 రోజుల పాటు గడిపిన అనంతరం జూలై 15న వారు భూమికి తిరిగిరాగారు. తాజాగా మంగళవారం శుభాన్షు శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన నెమ్మదిగా నడుచుతూ, ఇద్దరి సహాయంతో అడుగులు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నా ఆరోగ్యాన్ని గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలంటూ వచ్చిన సందేశాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు.

Details

అక్కడ శరీరంలో చాలా మార్పులొస్తాయి

అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని గురించి వివరిస్తూ, "అక్కడ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ద్రవ మార్పులు, హృదయ స్పందన రేటు మారడం, సమతుల్యత పునఃసవరణ, కండరాల బలహీనత వంటి ప్రభావాలు ఉంటాయి. మానవ శరీరం అనువర్తిత వాతావరణానికి అనుగుణంగా ఈమార్పులకు లోనవుతుంది. భూమికి తిరిగివచ్చిన తర్వాత, శరీరం మళ్ళీ గురుత్వాకర్షణకు సరిపోయే విధంగా సర్దుబాటు అవుతుంది. ఈ ప్రక్రియ ప్రతి వ్యోమగామికి భిన్నంగా ఉంటుంది. అయితే శరీరం కొత్త వాతావరణానికి అలవాటు పడే వేగాన్ని గమనించి నేను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఈ సందర్బంగా శుక్లా పంచుకున్న అనుభవం వ్యోమగాముల శారీరక మార్పులపై ప్రజల్లో ఆసక్తిని కలిగించింది. అంతరిక్షం నుండి భూమిపైకి తిరిగే ప్రయాణం అంత తేలిక కాదు అని ఆయన పేర్కొనడం గమనార్హం.