తదుపరి వార్తా కథనం
Sunita Williams: అంతరిక్షం నుంచి పుడమికి.. త్వరలోనే భారత్‌కు సునీతా విలియమ్స్ రాక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 19, 2025
08:46 am
ఈ వార్తాకథనం ఏంటి
సుదీర్ఘ నిరీక్షణకు అనంతరం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి చేరుకున్నారు.
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ 'ఫ్రీడమ్' భద్రంగా తీసుకొచ్చింది.
బుధవారం తెల్లవారుజామున ఈ క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ సంఘటనను ఊపిరిపట్టుకుని వీక్షించారు.
సునీత క్షేమంగా భూమిని చేరుకోవడంతో, భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో ఆనందోత్సాహాలు చెలరేగాయి.
ఈ సందర్భంగా ఆమె బంధువులలో ఒకరు మీడియాతో మాట్లాడుతూ, సునీత త్వరలోనే భారత్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు.