LOADING...
Sunita Williams: యూఎస్ నేవీ నుంచి నాసా వరకు.. సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ ఇదే!
యూఎస్ నేవీ నుంచి నాసా వరకు.. సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ ఇదే!

Sunita Williams: యూఎస్ నేవీ నుంచి నాసా వరకు.. సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన సువర్ణ అధ్యాయాలను లిఖించుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ పదవీ విరమణ ప్రకటించారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో సేవలందించిన ఆమె, 2025 డిసెంబర్‌ 27న అధికారికంగా రిటైర్మెంట్‌ తీసుకున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సునీతా విలియమ్స్‌.. తన ప్రస్థానానికి ఘనంగా ముగింపు పలికారు.

Details

రికార్డుల రారాణి

సుదీర్ఘ కెరీర్‌లో సునీతా విలియమ్స్‌ మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లారు. అక్కడ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, అనేక చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. యూఎస్‌ నేవల్‌ అకాడమీ నుంచి ఫిజికల్‌ సైన్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన సునీతా విలియమ్స్‌.. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుముందు యూఎస్‌ నేవీలో ఆమెకు ఉన్న విస్తృత అనుభవమే నాసా ఎంపికలో కీలకంగా మారింది.

Detals

సైన్స్‌ ఫిక్షన్‌ నుంచి స్పేస్‌ స్టేషన్‌ దాకా

గతంలో ఢిల్లీలోని అమెరికన్‌ సెంటర్‌లో విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను సునీతా విలియమ్స్‌ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలో అంతరిక్ష దృశ్యాలు చూస్తుంటే అవి ఎంతో ఆశ్చర్యంగా అనిపించేవి. కానీ నేను ఎప్పటికైనా వ్యోమగామిని అవుతానని అప్పట్లో అస్సలు అనుకోలేదు. స్టార్‌ ట్రెక్‌ వంటి సైన్స్‌ ఫిక్షన్‌ కథలంటే ఇష్టం ఉండేది గానీ, నిజంగా అంతరిక్షంలోకి వెళ్తానని ఊహించలేదని ఆమె వెల్లడించారు.

Advertisement

Details

వెటర్నరీ డాక్టర్‌ కావాలనే కలతో మొదలు

సునీతా విలియమ్స్‌ తండ్రి వైద్యుడు కాగా, తల్లికి జంతువులంటే అపారమైన ప్రేమ. అందుకే చిన్నప్పటి నుంచే ఆమె పశువైద్యురాలు (వెటర్నరీ డాక్టర్‌) కావాలని కలగన్నారు. "నాకు జంతువులంటే చాలా ఇష్టం. డాక్టర్‌ కావాలని అనుకున్నాను. కానీ పాఠశాల పూర్తయ్యాక ఏ దారిలో వెళ్లాలో స్పష్టత ఉండేది కాదు," అని ఆమె వివరించారు. కోరుకున్న కాలేజీలో సీటు రాకపోవడంతో, అన్నయ్య ఇచ్చిన చిన్న సలహా మేరకు మిలిటరీలో చేరారు. ఆ ఒక్క నిర్ణయం ఆమె జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. హెలికాప్టర్‌ పైలట్‌గా, ఎయిర్‌క్రాఫ్ట్‌ కమాండర్‌గా, టెస్ట్‌ పైలట్‌గా తన ప్రతిభను నిరూపించిన తర్వాతే అంతరిక్ష ప్రయాణంపై ఆసక్తి కలిగిందని సునీతా తెలిపారు.

Advertisement

Details

కాలమే ముందుకు నడిపిస్తుంది

నాసాలోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ను సందర్శించినప్పుడు అక్కడి శిక్షణను చూసి, నేను కూడా అంతరిక్షంలోకి వెళ్లగలనా? అనే ఆలోచన తొలిసారి కలిగిందని ఆమె గుర్తు చేసుకున్నారు. జీవితంలో చిన్న వయసులోనే అన్నిటికీ సమాధానాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. కాలమే మనల్ని సరైన దారిలో నడిపిస్తుందంటూ నేటి యువతకు ఆమె ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.

Details

సునీతా సృష్టించిన చారిత్రక మైలురాళ్లు

608 రోజులు అంతరిక్షంలో సునీతా విలియమ్స్‌ గడిపిన మొత్తం కాలం. నాసా వ్యోమగాముల్లో అత్యధిక కాలం కక్ష్యలో గడిపిన వారిలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. స్పేస్‌వాక్‌లు మొత్తం 9 సార్లు స్పేస్‌వాక్‌ చేసి, సుమారు 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో మ్యారథాన్‌ అంతరిక్షంలోనే మ్యారథాన్‌ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. నన్ను బాగా తెలిసిన వారికి ఒక విషయం తెలుసు.. అంతరిక్షం అంటే నాకు ప్రాణం. అదే నా ఫేవరెట్‌ ప్లేస్‌ అని సునీతా విలియమ్స్‌ గర్వంగా చెబుతారు.

Advertisement