Isro calls off Gaganyaan: గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగాన్ని నిలిపేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ టెస్ట్‌ను వాయిదా వేసింది. టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ (TV-D1)ను శనివారం ఉదయం 8:00 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల మిషన్ లాంచ్‌ను ఉదయం 8:30లకు వాయిదా వేశారు. ఆ తర్వాత 8:45 రీ షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలో మిషన్ టేకాఫ్ కాకపోవడంతో మిషన్‌ను ప్రస్తుతానికి నిలివేసినట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఎందుకు లాంచ్ కాలేదనే విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామన్నారు. అయితే టెస్ట్ వెహికల్‌లో ఎలాంటి సమస్య లేదని తాము గుర్తించినట్లు వివరించారు.