Samsung Galaxy S24 FE: 'గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ' లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ 'శాంసంగ్' తమ గెలాక్సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ'ని ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్‌లోని ఎస్ సిరీస్ ఫోన్లకు అందుబాటులో ఉండే ఫ్యాన్ ఎడిషన్ (ఎఫ్‌ఈ) మోడల్ కావడం విశేషం. దీని ధర కాస్త తక్కువగా ఉన్నా, ఇందులో ఆధునిక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే, 4 నానో మీటర్ డెకా కోర్ ఎగ్జినోస్ 2400ఈ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
ఆక్టోబర్ 3 నుంచి బుకింగ్స్
8జీబీ + 128జీబీ వేరియంట్ రూ. 59,999 ఉండగా, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 65,999 ఉంది. అయితే 8జీబీ + 512జీబీ వేరియంట్ ధర ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, యెల్లో రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి భారతదేశంలో విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దీని ప్రత్యేకత. సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అద్భుతమైన అనుభవం అందించడానికి సిద్ధంగా ఉంది!