
Galaxy S25 FE: 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో గెలాక్సీ S25 FE.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్!
ఈ వార్తాకథనం ఏంటి
శాంసంగ్ తన Galaxy S25 సిరీస్‌లో భాగంగా కొత్త 'Galaxy S25 FE' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లు, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. డిస్‌ప్లే & డిజైన్ Galaxy S25 FEలో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Gorilla Glass Victus+ అందించారు. డిజైన్ పరంగా గ్లాస్ బ్యాక్, మెరుగుపరచిన ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది. అలాగే IP68 రేటింగ్ ఉండటంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యం కల్పించబడింది.
Details
ప్రాసెసర్ & పనితీరు
ఈ ఫోన్‌లో Exynos 2400 చిప్‌సెట్‌తో పాటు Xclipse 940 GPU ఉంది. 8GB RAMతో పాటు 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు లభ్యమవుతున్నాయి. గత మోడల్‌తో పోలిస్తే 10% పెద్ద వెపర్ చాంబర్‌ను ఉపయోగించడంతో హీటింగ్ సమస్య తగ్గి, ఎక్కువసేపు శక్తివంతమైన పని'తీరు కొనసాగుతుంది. సాఫ్ట్‌వేర్ & అప్‌డేట్లు Galaxy S25 FE 'Android 16' ఆధారంగా 'One UI 8'పై నడుస్తుంది. శాంసంగ్ దీన్ని 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లతో సపోర్ట్ చేస్తుందని హామీ ఇచ్చింది. అలాగే జెమినీ లైవ్, నౌ బార్, సర్కిల్ టు సెర్చ్, జెనరేటివ్ ఎడిట్, ఆడియో రేజర్ వంటి AI ఫీచర్లను కూడా అందించింది.
Details
కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 8MP టెలిఫోటో కెమెరా (OIS, 3X ఆప్టికల్ జూమ్) లభిస్తుంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. బ్యాటరీ & చార్జింగ్ 4,900mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Details
ధరలు & కలర్స్
128GB మోడల్ ధర - USD 649.99 (రూ. 57,300) 256GB మోడల్ ధర - USD 709.99 (రూ. 62,600) 512GB మోడల్ (యూరప్ మార్కెట్) - 929 యూరోలు (రూ. 95,300 సుమారు) Galaxy S25 FE ఐసీ బ్లూ, జెట్ బ్లాక్, నేవీ, వైట్ రంగుల్లో లభ్యం కానుంది. లాంచ్ రోజు నుంచే సేల్ ప్రారంభమవుతుంది. మొబైల్ కొనుగోలు చేసిన యూజర్లకు Google AI Pro Planలో ఆరు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందజేస్తారు.