
AI features: ఆడియో ఓవర్‌వ్యూ, కాన్వాస్ అప్‌డేట్లతో.. గూగుల్ జెమినీకి ఏఐ వేదిక కొత్త సొబగులు..
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ వేదిక తాజాగా కొత్త ఫీచర్లతో మరింత మెరుగైంది.
ఇప్పుడు ఇది ఆడియో ఓవర్‌వ్యూ, కాన్వాస్ అప్‌డేట్లతో మరింత ఆకర్షణీయంగా మారింది.
రచయితలు, డెవలపర్లు, పరిశోధకుల కోసం ఈ టూల్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే ఉద్దేశంతో గూగుల్ ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
కంటెంట్ సృష్టించుకోవడానికి, డాక్యుమెంట్‌ను సవరించుకోవడానికి, ఏఐ సాయంతో ఆడియో సారాంశాలను రూపొందించుకోవడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.
వివరాలు
కాన్వాస్
ఇది డాక్యుమెంట్లు, కోడ్‌లను రాయడానికి, సవరించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడే ఇంటరాక్టివ్ వర్క్‌స్పేస్.
ప్రాంప్ట్ బార్‌లో కాన్వాస్ ఎంపిక చేస్తే ముందుగా నాణ్యమైన డిజిటల్ చిత్తు ప్రతిని రూపొందిస్తుంది.
అనంతరం జెమినీ ఏఐ ఆధారిత ఫీడ్‌బ్యాక్‌తో మెరుగుపరచుకోవచ్చు. వ్యాసాలు, కథనాలు, నివేదికలు, బ్లాగ్ పోస్టులపై సమీక్ష చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
సరళమైన ఆదేశాలతో టోన్, పొడవు, ఫార్మాట్‌లను మార్పు చేసుకోవచ్చు. డెవలపర్ల కోసం ఇది సంపూర్ణ కోడింగ్ వాతావరణాన్ని అందిస్తుంది.
ఐడియాలను ప్రయోగాత్మక వెబ్ యాప్‌లు, పైథాన్ స్క్రిప్ట్స్, గేమ్స్, సిమ్యులేషన్స్‌గా మార్చుకోవచ్చు.
కోడ్‌ను జనరేట్,ఎడిట్ చేయడమే కాకుండా హెచ్‌టీఎంఎల్ ప్రివ్యూనూ చూపిస్తుంది.
ఉదాహరణకు, యూజర్ ఈమెయిల్ సబ్‌స్క్రిప్షన్ ఫారమ్ రూపొందించమని అభ్యర్థిస్తే, తక్షణమే ప్రివ్యూను చూపిస్తుంది. వెంటనే అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
వివరాలు
ఒక్క క్లిక్‌తో గూగుల్ డాక్స్‌కు ఎక్స్‌పోర్ట్
ఇది డెవలప్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, వేగంగా పనులు పూర్తయ్యేలా చేస్తుంది.
ఈ ఫీచర్ కోడింగ్ నేర్చుకునేవారికి, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు రూపొందించే నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పని పూర్తయ్యాక ఒక్క క్లిక్‌తో గూగుల్ డాక్స్‌కు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
జెమినీ, జెమినీ అడ్వాన్స్‌డ్ చందాదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇది అన్ని భాషలను సపోర్ట్ చేస్తుంది.
వివరాలు
ఆడియో ఓవర్‌వ్యూ
ఇది అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఆడియో పాడ్‌కాస్ట్‌లుగా మార్చగల ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
ఏఐ హోస్ట్‌లు ఈ కంటెంట్‌ను చదివి వినిపిస్తాయి. ఈ ఫీచర్ మునుపు గూగుల్ నోట్‌బుక్ ఎల్‌ఎంకే పరిమితమైనప్పటికీ, ఇప్పుడు అన్ని జెమినీ యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ భాషను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ త్వరలో మరికొన్ని భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
ఏదైనా టాపిక్‌కు సంబంధించిన డాక్యుమెంట్ లేదా స్లైడ్‌ను అప్‌లోడ్ చేసి, ప్రాంప్ట్ బార్‌లో చిప్ సూచనను ఎంచుకుంటే, కొద్ది నిమిషాల్లోనే పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌లో ఆడియో సారాంశాన్ని అందిస్తుంది.
వివరాలు
ఆడియో ఫైళ్ల డౌన్‌లోడ్.. మరింత సులభం
ఈ ఫీచర్ విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
క్లాస్ నోట్స్, పరిశోధన పత్రాలు, ఈమెయిల్ థ్రెడ్స్ వంటి వాటిని ఆడియో ఫార్మాట్‌లో వినిపించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
జెమినీ మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
అంతేకాదు, ఆడియో ఫైళ్లను డౌన్‌లోడ్, షేర్ చేయడంవల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.