
Gmail: స్పామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ Shielded Email పేరిట కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
మనలో చాలా మంది వ్యక్తిగత అవసరాలకు ఒక మెయిల్ ఐడీ, ఆఫీసు అవసరాలకు మరో మెయిల్ ఐడీని వాడుతుంటారు.
ముఖ్యమైన మెయిల్స్‌ను మిస్ కాకుండా ఉండేందుకు, లాగిన్ కోసం ఎక్కడ పడితే అక్కడ మెయిల్ ఐడీ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు.
దీని వెనుక ముఖ్యమైన కారణం స్పామ్ బెడద. చాలా సార్లు అవసరమైన మెయిల్స్ కంటే, అవాంఛిత మెయిల్స్‌తో మన ఇన్‌బాక్స్ నిండిపోతుంది.
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు గూగుల్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది.
వివరాలు
షీల్డ్ ఈమెయిల్.. జీమెయిల్ కొత్త ఫీచర్
గూగుల్ "షీల్డ్ ఈమెయిల్" పేరుతో ఒక కొత్త సేవను అందుబాటులోకి తేవాలని చూస్తోంది.
ఈ ఫీచర్ ద్వారా తాత్కాలిక మెయిల్ ఐడీని సృష్టించుకోవచ్చు. అంటే, ఎక్కడైనా లాగిన్ కావాలంటే ఈ షీల్డ్ మెయిల్ ఐడీని వాడుకోవచ్చు.
దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఐడీ 10 నిమిషాలపాటు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో తాత్కాలిక మెయిల్ ఐడీ సృష్టించుకోవచ్చు.
అయితే, ఈ ఫీచర్‌పై గూగుల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో దీనిపై మరింత సమాచారం రావచ్చని భావిస్తున్నారు.
వివరాలు
ఆపిల్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది
గూగుల్ కంటే ముందే ఆపిల్ ఈ తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
"హైడ్ మై ఈమెయిల్" (Hide My Email) పేరిట ఆపిల్ యూజర్లు తాత్కాలిక మెయిల్ ఐడీని సృష్టించుకోవచ్చు. అవసరమైన యాప్‌లో లాగిన్ కావాలంటే వెంటనే ఈ తాత్కాలిక మెయిల్ ఐడీని వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌లు స్పామ్ సమస్యను తగ్గించి, ప్రైవసీ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.