
Google: 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు 'ఎమర్జెన్సీ వార్నింగ్' నిజం కాదు: గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజుల్లో 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు తక్షణం పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రచారం చేసిన 'ఎమర్జెన్సీ వార్నింగ్' వార్తలు అవాస్తవమని (fake) గూగుల్ స్పష్టం చేసింది. జీమెయిల్ అకౌంట్లకు అత్యంత బలమైన భద్రతా వ్యవస్థ ఉన్నందున, ఈ వార్తల్లోని వాదనలలో నిజం ఏమాత్రం లేదని కంపెనీ తెలిపింది. గూగుల్ తన బ్లాగ్‌లో వెల్లడిస్తూ, "మేము మా జీమెయిల్ యూజర్లకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. జీమెయిల్‌లో అత్యంత ప్రభావవంతమైన, బలమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్ని తప్పుదారిలోని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జీమెయిల్‌లో భద్రతా ఉల్లంఘన జరిగిందని, మేము అనేక యూజర్లకు హెచ్చరికలు పంపించామన్నది వాటి సారాంశం.. ఇవన్నీ అసత్యం" అని తెలిపింది.
వివరాలు
గూగుల్ సేల్‌ఫోర్స్ డేటాబేస్‌లోకి "షైనీ హంటర్స్"
ఇప్పటికే, గూగుల్ సేల్‌ఫోర్స్ డేటాబేస్‌లోకి "షైనీ హంటర్స్" అనే హ్యాకింగ్ గ్రూప్ చొరబడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వ్యాప్తి చెందడంతో వినియోగదారులు,కంపెనీలు,సాధారణ సమాచార భద్రతపై చింత వ్యక్తం చేసారు. అయితే, గూగుల్ దీనిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. తాజాగా గూగుల్ వెల్లడించింది, హ్యాకర్లు తమ వేదికను చొరబెట్టడానికి ప్రయత్నించిన విషయం వాస్తవమే, కానీ వారి బలమైన భద్రతా వ్యవస్థ కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వివరాలు
గూగుల్ మార్గదర్శకాలు
ఇన్‌బాక్స్‌లలోకి ప్రవేశించే వారిని 99.9శాతం అడ్డుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే, యూజర్లు మాల్వేర్, హానికర సాఫ్ట్‌వేర్‌ల నుంచి రక్షణ పొందారని, మరింత భద్రత కోసం సురక్షితమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలని గూగుల్ సూచించింది. పాస్‌వర్డ్‌లను సురక్షితంగా వాడటం, గూగుల్ సూచించిన మార్గదర్శకాలు పాటించడం వల్ల, చొరబాట్లను సులభంగా గుర్తించవచ్చని గూగుల్ తెలిపింది.