
GoI: ఆన్ లైన్ గేమ్ ల భరతం పట్టనున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్ లైన్ గేమ్ ల భరతం పట్టడానికి కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వీటికి టీనేజ్ యువతతో సహా పెద్దవారు సైతం బానిసలయ్యారు.
వీటి వలలో పడి బలవంతపు దుర్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య ఎక్కువగానే వుంది.
డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో వున్నారు. ఆన్ లైన్ గేమ్ ల ను క్రమబద్ధీకరించే ఆలోచనలో కేంద్రం వుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ , రియల్ మనీ గేమ్‌లపై సమయం, ఖర్చు పరిమితులను విధించాలన్న ప్రతి పాదనకు మొగ్గు పెరుగుతోంది.
ఆ దిశగా అడుగులు పడుతున్నాయని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని వర్గాలు సూచించాయి.
చైనాలో అమలు అవుతున్న నియంత్రణలు, వ్యూహాలు ఇటీవలి అంతర్గత చర్చకు వచ్చాయి.
Details
నియంత్రణ మామూలుగా వుండదు: ఐటి మంత్రిత్వ శాఖ
గేమ్‌ల అనుమతిని నిర్ణయించడానికి స్వయం-నియంత్రణ సంస్థల(SROలు)పై మాత్రమే ఆధారపడకూడదని నిర్ణయానికి వచ్చారు.
నిర్ణీత సమయం తర్వాత ఆ గేమ్ యాప్స్ వాటంతటవే మూతపడేలా చూస్తారు.
మరింత చురుకైన విధానంగా సమయ పరిమితులను విధించే అవకాశాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది.
ఐటి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి ప్రకారం ఈ విధానం ధృవీకరణ గేమ్‌లకు మెరుగైన ప్రత్యామ్నాయంగా పరిగణించనున్నారు.
ఈ నియంత్రణ నిర్ణయాలతో గేమింగ్ పరిశ్రమ వల్ల తలెత్తే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Details
గేమర్‌లలో గణనీయమైన భాగం డబ్బుతోముడిపడి ఉంది
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌లలో ఒకటిగా ఉంది.దాదాపు 570 మిలియన్ యాక్టివ్ గేమర్‌లను కలిగి ఉంది.
ఈ గేమర్‌లలో గణనీయమైన భాగం డబ్బుతో ప్రమేయం వుంటుంది.
దాదాపు 25 శాతం,అంతకంటే ఎక్కువ మంది రియల్-మనీ గేమింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.
గేమింగ్ వ్యసనం గురించిన ఆందోళనలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రతిపాదిత నిబంధనలు గేమింగ్ కార్యకలాపాలపై వెచ్చించే సమయాన్నిపరిగణనలోకి తీసుకుంటాయి.
ఆటగాడు వాటి కోసం వెచ్చించే డబ్బు రెండింటినీ అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.