LOADING...
TTD: టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్

TTD: టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన వ్యాపారస్తులే ఇప్పటివరకు సిట్‌ దర్యాప్తులో పట్టుబడిన వారు. తాజాగా, కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంను సిట్‌ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సీబీఐ నేతృత్వంలోని సిట్‌ ఈ కేసును నిఖార్సైన దర్యాప్తు చేస్తోంది. సుబ్రహ్మణ్యంను తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత, నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు చేస్తారని సమాచారం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్