LOADING...
Deepti Sharma: వేలంలో హై వోల్టేజ్ డ్రామా.. దీప్తి శర్మ కోసం డిల్లీ-యూపీ మధ్య తీవ్ర పోటీ
వేలంలో హై వోల్టేజ్ డ్రామా.. దీప్తి శర్మ కోసం డిల్లీ-యూపీ మధ్య తీవ్ర పోటీ

Deepti Sharma: వేలంలో హై వోల్టేజ్ డ్రామా.. దీప్తి శర్మ కోసం డిల్లీ-యూపీ మధ్య తీవ్ర పోటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL 2026) మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేలం కోసం హైడ్రామా కొనసాగింది. చివరి వరకూ సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ బిడ్డింగ్ వార్ మొత్తం ఫ్రాంచేజీలను ఆకర్షించింది. మొదట ఆమెను దక్కించుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేయగా, యూపీ వారియర్స్ మాత్రం కీలకమైన 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్‌ను వినియోగించి రూ.3.20 కోట్ల భారీ ధరకు ఆమెను తిరిగి జట్టులో చేర్చుకుంది. ఈ ఏడాది జరిగిన WPLలో యూపీ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరించినా, మెగా వేలానికి ముందు జట్టు ఆమెను రిటైన్ చేయకుండా వదిలింది.

Details

 RTM కార్డ్ ఉపయోగించిన దిల్లీ

దాంతో గురువారం జరిగిన వేలంలో తొలి సెట్‌లో కనీస ధర రూ.50 లక్షలకు ఆమెను దక్కించుకోవడానికి దిల్లీ క్యాపిటల్స్ ముందుకు వచ్చింది. అదే సమయంలో యూపీ RTM కార్డ్ ఉపయోగించుకోవడంతో, పోటీ మరింత హై డ్రామాగా మారింది. దిల్లీ ఫ్రాంచైజీ వెంటనే తమ బిడ్‌ను రూ.3.20 కోట్ల వరకు పెంచగా, ఆ మొత్తానికే యూపీ అంగీకరించి దీప్తిని మళ్లీ తమ జట్టుకు తీసుకెళ్లింది. యూపీ జట్టు ఇంత భారీ ధర చెల్లించడాన్ని చూసి దిల్లీ క్యాంప్‌లో ఉన్న సౌరభ్ గంగూలీ ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.

Details

వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర

ఈ బిడ్‌తో దీప్తి శర్మ WPL చరిత్రలో రెండో అత్యధిక ధరకు అమ్ముడైన క్రీడాకారిణిగా రికార్డులో నిలిచింది. ఇప్పటివరకు స్మృతి మంధాన పేరు మొదటిది — ఆమెను బెంగళూరు రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్‌లో దీప్తి శర్మ బ్యాట్, బాల్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 215 పరుగులు, 22 వికెట్లతో టీమ్ ఇండియా కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచింది.