తదుపరి వార్తా కథనం

Elon Musk : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేయొచ్చు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 31, 2023
02:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్) మరో సంచలన ఫీచర్ ను తీసుకురానుంది.
ఎక్స్ లో త్వరలో ఆడియో,వీడియో కాల్ సదుపాయాన్ని కల్పిస్తామని స్వయంగానే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
ఈ ఫీచర్ కోసం ఎటువంటి సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చని సంచలన ప్రకటన చేశాడు.
Details
ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్స్, పీసీలో మాత్రమే కాల్స్ సదుపాయం
కాల్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎక్స్ అనేది ఎఫెక్టివ్ గ్లోబల్ అడ్రస్ బుక్ కు చక్కటి వేదికగా మారుతుందని, ఇందులోని ఫీచర్లు అన్ని యూనిక్ గా ఉన్నాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్స్, పీసీలో మాత్రమే ఈ కాల్స్ ఫీచర్ పనిచేస్తుందన్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ట్విట్టర్ యూజర్లు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.