Google AI Plus: భారత్‌లో అందుబాటులోకి గూగుల్ ఏఐ ప్లస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో గూగుల్ తన కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవ 'గూగుల్ ఏఐ ప్లస్'ను ప్రారంభించింది. నెలకు రూ.399 ధరగా ఉండే ఈ ప్లాన్‌ను మొదటి ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫర్‌గా కేవలం రూ.199కే వినియోగదారులకు అందిస్తోంది. దేశంలో ఉన్న వారికి అత్యాధునిక కృత్రిమ మేధ(ఏఐ)టెక్నాలజీని మరింత సులభంగా, తక్కువ ఖర్చుకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ చర్యకు గూగుల్ ముందడుగు వేసింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అయిన గూగుల్ ఏఐ ప్లస్ ద్వారా గూగుల్ ఎకోసిస్టమ్‌లోని ప్రీమియం ఏఐ సౌకర్యాలు లభిస్తాయి. ఇందులో గూగుల్ ఇప్పటివరకు రూపొందించిన అత్యాధునిక మోడల్ జెమినీ 3 ప్రోను వినియోగించుకోవచ్చు.
వివరాలు
గూగుల్ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్ నోట్‌బుక్ ఎల్‌ఎం యాక్సెస్ కూడా ఇందులో భాగం
దీని ద్వారా రైటింగ్,కోడింగ్,అనువాదం,ఐడియాల బ్రెయిన్‌స్టార్మింగ్,సమస్యల పరిష్కారం వంటి పనులు జెమినీ యాప్‌లో మరింత వేగంగా, సమర్థవంతంగా చేయవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో వీడియో తయారీ సదుపాయం కూడా ఉండటంతో, యాప్ నుంచే చిన్న వీడియోలు రూపొందించుకోవచ్చు. అలాగే ఆలోచనలకు రూపం ఇవ్వడానికి,కథనాలను రూపొందించడానికి ఉపయోగపడే ఫ్లో వంటి క్రియేటివ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించి ముఖ్యాంశాలను సారాంశంగా చెప్పే గూగుల్ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్ నోట్‌బుక్ ఎల్‌ఎం యాక్సెస్ కూడా ఇందులో భాగం.
వివరాలు
ఫ్యామిలీ షేరింగ్ ద్వారా ఐదుగురు సభ్యుల వరకు ఉపయోగించే అవకాశం
మరోవైపు జీమెయిల్, డాక్స్ వంటి యాప్‌లలో జెమినీ మరింత సమర్థంగా కలిసిపోవడంతో, మెయిల్స్ డ్రాఫ్ట్ చేయడం, కంటెంట్ రీరైట్ చేయడం, సమాచారం సమరీ చేయడం, రైటింగ్ మెరుగుపరుచుకోవడం వంటి పనులు వేర్వేరు టూల్స్‌కు మారకుండా ఒకేచోట చేయవచ్చు. అంతేకాదు, ఫోటోస్, డ్రైవ్, జీమెయిల్‌లపై కలిపి 200జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభించడంతో పాటు, ఫ్యామిలీ షేరింగ్ ద్వారా ఐదుగురు సభ్యుల వరకు ఉపయోగించే అవకాశం కూడా గూగుల్ ఈ ప్లాన్‌లో కల్పిస్తోంది.