Page Loader
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం 
మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం

Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం కోట్లాది భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో,టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా కుంభమేళాను సెలబ్రేట్ చేస్తోంది. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌లో గులాబీ రేకులతో రూపొందించిన వర్చువల్ యానిమేషన్‌ను అందించగా, ఇది భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. గూగుల్‌లో 'కుంభమేళా' లేదా 'మహా కుంభమేళా' అని సెర్చ్ చేస్తే, గులాబీల వర్షం పడుతున్నట్లు కనిపించే ఈ అందమైన యానిమేషన్ ప్రత్యక్షమవుతుంది. కుంభమేళా వైభవాన్ని ప్రతిబింబించేందుకు రూపొందించిన ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాకుండా, ఈ యానిమేషన్‌ను ఫేస్‌ బుక్, వాట్సాప్,'ఎక్స్', లేదా ఇ-మెయిల్ ద్వారా సులభంగా షేర్ చేసే అవకాశం గూగుల్ కల్పించింది.

వివరాలు 

మేళా చివరి నాటికి 40 కోట్లకు పైగా భక్తులు

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈసారి సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ మేళా చివరి నాటికి 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేయబడింది. మొత్తం 45 రోజులు జరిగే ఈ మహా కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.2 లక్షల కోట్ల ఆదాయం తెస్తుందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని మీరు కూడా ఆస్వాదించేందుకు గూగుల్ అందించిన యానిమేషన్‌ను ట్రై చేయడం మరువద్దు.