
Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా అనేక అద్భుతాలు సాక్షాత్కారమవుతున్నాయి.
ఏఐ యాంకర్లు,ఏఐ డాక్టర్లు వంటి వినూత్న ఆవిష్కరణలతో అన్ని రంగాల్లోనూ పెద్దమార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా గూగుల్ నూతన ఫీచర్లను తీసుకొస్తోంది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా 'ఏజెంట్ మోడ్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు.
ఈ మోడ్ ద్వారా అద్దె ఇళ్ల కోసం వెతకడం ఎంతో ఈజీ అయింది. ఇకపై అద్దె ఇల్లు కోసం వెతకాల్సిన చికాకులు ఉండవు.
యూజర్లు తమ అవసరాలను జెమిని ఏఐతో చెప్పినట్లయితే, అది వెబ్‌లో స్వయంగా శోధించి తగిన ఫలితాలను అందిస్తుంది.
వివరాలు
ప్రాజెక్ట్ మారినర్ టూల్ సహాయంతో అద్దె బుక్ చేసుకునే అవకాశం
యూజర్లు కోరుకున్న ప్రాంతంలో, నిర్దిష్ట ధర పరిధిలో అద్దెకు ఉన్న ఇళ్లను ఈ ఏఐ సులభంగా గుర్తిస్తుంది.
అంతేకాక, ప్రాజెక్ట్ మారినర్ అనే టూల్ సహాయంతో వాటిని బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇదే కాకుండా, గూగుల్ షాపింగ్ కోసం కూడ నూతన ఫీచర్లను ప్రకటించింది.
ఇప్పుడు ఏఐ సహాయంతో, మీ ఫోటోలను ఉపయోగించి మీరు ఒక డ్రెస్సు వేసుకున్నప్పుడు అది ఎలా కనిపిస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు.
మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి గూగుల్ సెర్చ్ అన్ని వెబ్‌సైట్లను పరిశీలించి, అనువైన సమాచారం సమకూర్చుతుంది.
ఈ మొత్తం ప్రక్రియను 'ఏఐ ఏజెంట్' మీ తరఫున నిర్వహిస్తుంది. అంటే, మీకు కావాల్సిన షాపింగ్‌ను ఇది మీకోసం చేస్తుంది.
వివరాలు
'Google Veo'లో కొత్త ఫీచర్లు
అంతేకాకుండా, 'Google Veo' అనే ఫీచర్‌లో కూడా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు.
దీని ద్వారా మీరు మీ ఫోటోలు, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి వీడియోలను సృష్టించుకోవచ్చు.
ఫోటోలను జోడించడం ద్వారా ఎఫెక్టివ్ వీడియోలను రూపొందించడంలో ఈ టూల్ ఎంతో ఉపయోగపడుతుంది.