LOADING...
Google Cloud outage: డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం
డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

Google Cloud outage: డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దిల్లీలో గూగుల్‌కు సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడి నెట్‌వర్కింగ్ పరికరాలను అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో గూగుల్ క్లౌడ్ సేవలు ప్రభావితమైనట్లు సంస్థకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వెల్లడించింది. అయితే ఈ అగ్నిప్రమాదం ఎప్పుడు సంభవించిందనే విషయాన్ని గూగుల్ వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వివరాలు 

ఈ ప్రాంతాలలో నెట్‌వర్క్ ట్రాఫిక్‌పై ప్రభావం

ఈ తరహా అంతరాయాలు వ్యాపార సంస్థల కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. గూగుల్ క్లౌడ్ సేవలపై ఆధారపడే కంపెనీల పనితీరు కొంత మందగించే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై, ముంబయితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ ట్రాఫిక్‌పై ప్రభావం పడినట్లు సమాచారం. ప్రస్తుతం సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని గూగుల్ తెలిపింది. ప్రపంచ క్లౌడ్ సేవల రంగంలో గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ అంతరాయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement