LOADING...
Google Chrome: గూగుల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టెక్‌ దిగ్గజం.. క్రోమ్‌ బ్రౌజర్‌లో సరికొత్త ఫీచర్
క్రోమ్‌ బ్రౌజర్‌లో సరికొత్త ఫీచర్

Google Chrome: గూగుల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టెక్‌ దిగ్గజం.. క్రోమ్‌ బ్రౌజర్‌లో సరికొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌ తన యూజర్లకు శుభవార్తను తెలిపింది. కంపెనీకి చెందిన క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. "స్మార్ట్ అలర్ట్ కంట్రోలర్" అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు చాలాకాలంగా ఉపయోగించని లేదా ఇంటరాక్ట్ కాని వెబ్‌సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌లను ఆటోమేటిక్‌గా ఆఫ్‌ చేయనుంది. బ్రౌజింగ్ సమయంలో తరచుగా అంతరాయం కలిగించే అనవసరమైన పాప్‌అప్ నోటిఫికేషన్‌లను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని గూగుల్ తెలిపింది. ఈ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, క్రోమ్ తన ప్రైవసీ టూల్స్‌ను మరింత మెరుగుపరచే పనిలో కూడా ఉందని తెలిపింది.

వివరాలు 

నోటిఫికేషన్ అనుమతులు కూడా ఆటోమేటిక్‌గా రద్దు 

కొత్త ఫీచర్ వివరాల ప్రకారం, ఇది క్రోమ్ సేఫ్టీ చెక్ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తుంది. గూగుల్ తన బ్లాగ్ పోస్టులో తెలిపిన ప్రకారం,ఇప్పటికే వెబ్‌సైట్ల నుండి కెమెరా,లొకేషన్ అనుమతులు తొలగించినట్లు పేర్కొంది. ఇకపై నోటిఫికేషన్ అనుమతులు కూడా ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. గూగుల్ షేర్ చేసిన అంతర్గత క్రోమ్ డేటా ప్రకారం, ఒక శాతం కంటే తక్కువ మంది యూజర్లు మాత్రమే వెబ్ నోటిఫికేషన్‌లతో నిజంగా ఇంటరాక్ట్ అవుతున్నారని తెలిసింది. అందుకే, యూజర్లకు సౌలభ్యం కలిగించేందుకు క్రోమ్ ఆటోమేటిక్ నోటిఫికేషన్ కంట్రోల్స్‌ను అమలు చేస్తోంది. అయితే, ఈ మార్పు అన్ని వెబ్‌సైట్లకు వర్తించదు. యూజర్ ఎంగేజ్‌మెంట్ తక్కువగా ఉండి, నోటిఫికేషన్‌లు అధికంగా పంపే సైట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది.

వివరాలు 

ఫీచర్‌ పూర్తిగా యూజర్ నియంత్రణలోనే..

అలాగే, యూజర్ స్వయంగా వెబ్ యాప్‌లుగా ఇన్‌స్టాల్ చేసిన సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌లపై ఈ మార్పు ప్రభావం చూపదని కూడా తెలిపింది. ఏదైనా సైట్‌కి సంబంధించిన అనుమతి రద్దు చేయబడితే, క్రోమ్ ఆ విషయం యూజర్‌కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. అలాగే, యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెబ్‌సైట్లను మళ్లీ ఓపెన్ చేసినప్పుడు, ఆ సైట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను తిరిగి ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్‌ పూర్తిగా యూజర్ నియంత్రణలోనే ఉంటుందని గూగుల్ తెలిపింది. యూజర్‌కు ఈ ఆటోమేటిక్ రివోకేషన్ ఫీచర్ అవసరం లేకపోతే, దానిని పూర్తిగా ఆఫ్ చేయడం కూడా సాధ్యమని వివరించింది.

వివరాలు 

 గణనీయంగా తగ్గిన నోటిఫికేషన్ ఓవర్‌లోడ్

గూగుల్ తెలిపిన ప్రకారం, ఫీచర్ టెస్టింగ్ సమయంలో నోటిఫికేషన్ ఓవర్‌లోడ్ గణనీయంగా తగ్గింది, అలాగే యూజర్ క్లిక్స్ లేదా వెబ్ యాక్టివిటీపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని తేలింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. తక్కువ నోటిఫికేషన్లు పంపే వెబ్‌సైట్లు ఎక్కువ యూజర్ ఎంగేజ్‌మెంట్ పొందాయి. అంటే ఈ ఫీచర్ యూజర్లకు మాత్రమే కాకుండా వెబ్‌సైట్లకు కూడా ప్రయోజనం కలిగిస్తుందని, వాటిని మరింత ఆలోచనాత్మకంగా నోటిఫికేషన్‌లు పంపేలా ప్రోత్సహిస్తుందని గూగుల్ పేర్కొంది.