
Pixel Journal app: ఆపిల్ Journal యాప్‌కు పోటీగా.. కొత్త Pixel Journal యాప్‌ని లాంచ్ చేసిన గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన తాజా Pixel 10 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో AI శక్తితో పనిచేసే Pixel Journal అనే కొత్త జర్నలింగ్ యాప్‌ని పరిచయం చేసింది. ఇది 2023లో ఆపిల్ iOS 17 తో లాంచ్ చేసిన తన Journal యాప్‌కు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ క్రియేటివ్ యాప్ వినియోగదారుల జర్నలింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి డివైస్‌లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్‌ని వినియోగిస్తుంది.
వివరాలు
యాప్ ఫీచర్లు
Pixel Journal యాప్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. మీ గత జ్ఞాపకాలు,పాత ఎంట్రీలు లేదా లక్ష్యాల ఆధారంగా రైటింగ్ ప్రాంప్ట్స్‌ని సూచించగలదు. ఒక జర్నల్ ఎంట్రీలో ఫోటోలు,లొకేషన్లు,కార్యకలాపాలను జోడించడం,అలాగే మీ మూడ్‌ని లాగ్ చేయడం కూడా వీలవుతుంది. యాప్ మీ రాత అలవాట్లను నేర్చుకొని, మీరు సాధారణంగా ఎప్పుడు ఎంట్రీలు రాస్తారు, ఒక నెల లేదా వారం లో అత్యంత పొడవైన ఎంట్రీ ఎన్ని పదాలుగా ఉందో వంటి వివరాలను ఇస్తుంది.
వివరాలు
ప్రైవసీ కోసం దీనిని లాక్ చేయవచ్చు
తన ప్రత్యేక జర్నలింగ్ ఫీచర్లతో పాటు, Pixel Journal యాప్ ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఎంట్రీలను అనధికారిక యాక్సెస్ నుండి రక్షించడానికి యాప్‌ను లాక్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా వినియోగదారుల వ్యక్తిగత ఆలోచనలు, జ్ఞాపకాలు వేరేవారు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ యాప్ కేవలం Pixel 10 సిరీస్ డివైస్‌లకే అందుబాటులో ఉంది, భవిష్యత్తులో పాత మోడళ్లలోకూడా అందుబాటులోకి రావచ్చు.