LOADING...
Nano Banana Pro: ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు
ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు

Nano Banana Pro: ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ తన ప్రముఖ AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'కి ఉచితంగా లభించే యాక్సెస్‌ను తగ్గించింది. "డిమాండ్ ఎక్కువగా ఉండటం" కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. 9to5 Google చూసిన సపోర్ట్ డాక్యుమెంట్ ప్రకారం, రోజుకు ఉచితంగా సృష్టించుకునే ఇమేజ్‌ల సంఖ్యను మూడు నుంచి రెండు వరకు తగ్గించారు. గూగుల్ చెప్పినట్టు, "ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్‌కి భారీ డిమాండ్" ఉండటమే ఈ మార్పు వెనుక కారణం.

డైనమిక్ పరిమితులు 

గూగుల్‌ AI సిస్టమ్స్‌ లిమిట్స్ మార్పులకు గురవుతూనే ఉంటాయి

ఆ సపోర్ట్ డాక్యుమెంట్‌లో మరో విషయం కూడా స్పష్టమైంది. గూగుల్‌ AI సిస్టమ్స్‌ వినియోగ పరిమితులు శాశ్వతం కావని. "లిమిట్స్ తరచుగా మారే అవకాశం ఉంది, ప్రతిరోజూ రీసెట్ అవుతాయి" అని పేర్కొంది. అంటే యూజర్లు ఈ మార్పుల ప్రకారం తమ వినియోగ అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే డాక్యుమెంట్‌లో మరో గూగుల్‌ AI మోడల్ అయిన Gemini 3 Pro ఉచిత వినియోగదారులకూ ఇలాంటి పరిమితులే ఉంటాయని సంకేతాలు ఇచ్చింది.

వినియోగ పరిమితులు 

Gemini 3 Pro ఉచిత వినియోగంపై కొత్త నియమాలు

గూగుల్‌ గత నవంబర్ 18న Gemini 3 Proను విడుదల చేసినప్పుడు, యూజర్లకు రోజుకు ఐదు ఉచిత ప్రాంప్ట్‌లను ఇచ్చింది. ఇది ముందు వచ్చిన Gemini 2.5 Proకి కూడా అదే లిమిట్. కానీ తాజాగా వచ్చిన సపోర్ట్ డాక్యుమెంట్ ప్రకారం, ఇప్పుడు ఈ మోడల్ కూడా ఉచిత యూజర్లకు అదనపు పరిమితులతో పనిచేయబోతుంది.

Advertisement

వినియోగదారు ప్రభావం 

పెయిడ్ యూజర్లకు ఎలాంటి మార్పులు లేవు

గూగుల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త పరిమితులు కేవలం ఉచిత యూజర్లకే వర్తిస్తాయి. Google AI Pro లేదా AI Ultra ప్లాన్ తీసుకున్న సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ పెయిడ్ ప్లాన్లు ఇప్పటికీ వరుసగా రోజుకు 100, 500 ప్రాంప్ట్‌లు అందిస్తున్నందున, సబ్‌స్క్రైబర్లు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ అడ్వాన్స్డ్ AI టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

Advertisement