Google Maps: ఇకపై వినియోగదారుడి లొకేషన్ హిస్టరీని గూగుల్ మ్యాప్స్ స్టోర్ చెయ్యదు
గూగుల్ తన వినియోగదారులకి శుభవార్త చెప్పింది. Google మ్యాప్స్‌ని ఉపయోగించే వినియోగదారులు ఇకపై,మీ లొకేషన్ హిస్టరీ గురించి ఆందోళన చెందకర్లేదు. Google ఇప్పుడు లొకేషన్ డేటాకు సంబంధించి కొత్త ప్లాన్‌లు చేస్తోంది. కొత్త నివేదిక ప్రకారం, వినియోగదారు డేటా ఇకపై Google Mapsలో స్టోర్ అవ్వదు. ఇంతకు ముందు, వినియోగదారుడి లొకేషన్ హిస్టరీ Google Maps సర్వర్‌లో స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు హిస్టరీ డేటా వినియోగదారుడి పరికరంలో అంటే ఫోన్‌లో మాత్రమే స్టోర్ అవుతుంది. Google Maps లొకేషన్ హిస్టరీ పేరును టైమ్‌లైన్‌గా మార్చింది. Google ఈ ఫీచర్ విడుదల తేదీ డిసెంబర్ 1, 2024గా నిర్ణయించింది.
Google Maps కొత్త అప్డేట్ ప్రయోజనాలు
Google Maps ఈ ఫీచర్ గోప్యత కోసం. సర్వర్‌లో డేటా స్టోర్ చేయబడినప్పుడు డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ పరికరంలో నిల్వ చేశాక ఈ ప్రమాదం తగ్గుతుంది. చాలా సార్లు, బలహీనమైన నెట్‌వర్క్ కారణంగా, వినియోగదారులు వారి లొకేషన్ హిస్టరీని చూడలేరు. కానీ అది పరికరంలో నిల్వ చేయబడిన తర్వాత, హిస్టరీని చూడటానికి నెట్‌వర్క్ అవసరం ఉండదు. Google Maps కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల డేటా కోసం కొత్త భద్రతా పొర. ప్రస్తుతం ఈ ఫీచర్ యాప్ కోసం మాత్రమే విడుదల చేయబడింది. ఇది వెబ్ వెర్షన్ కోసం విడుదల చేయబడుతుందా లేదా అనే దాని గురించి ప్రస్తుతం సమాచారం లేదు.