LOADING...
Mappls: గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ సవాల్ .. Mappls‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్ 
గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ సవాల్ .. Mappls‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్

Mappls: గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ సవాల్ .. Mappls‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి చెందిన స్వదేశీ మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్ MapmyIndia (Mappls) తన వినియోగదారుల కోసం కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నావిగేషన్‌కే పరిమితమైన ఈ యాప్, ఇప్పుడు ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మెట్రో, బస్సు, రైలు వివరాల కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే యాప్‌లో లభించనున్నాయి. కొత్త ఫీచర్‌లో ఏముంది? వినియోగదారులు తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు, మెట్రో, లోకల్ రైళ్ల మార్గాలను Mappls యాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఏ రూట్ ఎంచుకోవాలి, ఎక్కడ మారాలి వంటి వివరాలు స్పష్టంగా చూపించనుంది.

వివరాలు 

మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం 

ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ మెట్రో మార్చాలి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలి వంటి పూర్తి సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. ప్రయాణం మొత్తం ముందే ప్లాన్ చేసుకునేలా డిటైల్స్ అందిస్తుంది. రియల్‌టైమ్ సమాచారం బస్సులు లేదా రైళ్లు ఏ సమయానికి వస్తాయి, మొత్తం ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది వంటి వివరాలను రియల్ టైమ్ డేటాతో అత్యంత ఖచ్చితంగా చూపించనుంది.

వివరాలు 

హైదరాబాద్‌తో పాటు 18 ప్రధాన నగరాల్లో సేవలు 

ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 18 ప్రధాన నగరాల్లో ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లక్నో, ఇండోర్, భోపాల్, పాట్నా తదితర నగరాలు ఇందులో ఉన్నాయి. ఈ అప్‌డేట్ వెనుక ప్రధాన లక్ష్యం వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణాను ప్రోత్సహించడమేనని MapmyIndia సీఈఓ రోహన్ వర్మ తెలిపారు. ఎక్కువ మంది మెట్రో, బస్సులను ఉపయోగిస్తే రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి, కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు మెట్రో మార్గాలను ఎంచుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

Mappls యాప్‌లో ప్రత్యేకమైన ఫీచర్లు 

Mappls యాప్‌లో ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.ఇవి గూగుల్ మ్యాప్స్‌లో కూడా అందుబాటులో లేవు. ముఖ్యంగా 3D జంక్షన్ వ్యూ ద్వారా క్లిష్టమైన ఫ్లైఓవర్లు, జంక్షన్ల వద్ద ఏ వైపు వెళ్లాలో 3D రూపంలో చూపిస్తుంది. అలాగే రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదకరమైన మలుపుల గురించి ముందే హెచ్చరికలు ఇస్తుంది. మహిళలు లేదా ఒంటరిగా ప్రయాణించే వారు తమ లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది.

Advertisement

వివరాలు 

Mappls యాప్‌లో ప్రత్యేకమైన ఫీచర్లు 

ప్రస్తుతం ఈ అప్‌డేట్ iOS (iPhone) మరియు వెబ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. యాప్ స్టోర్‌లో 'Mappls' యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా త్వరలోనే ఈ అప్‌డేట్ విడుదల కానుంది. "మేక్ ఇన్ ఇండియా" ఆలోచనతో రూపొందిన ఈ స్వదేశీ యాప్, టెక్నాలజీ పరంగా అంతర్జాతీయ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. మీరు కూడా మెట్రో లేదా బస్సులో ప్రయాణించే వారైతే, ఒకసారి ఈ భారతీయ యాప్‌ను తప్పక ప్రయత్నించండి.

Advertisement