Page Loader
Google Meet : 1080p వీడియో హైక్వాలిటీతో గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు

Google Meet : 1080p వీడియో హైక్వాలిటీతో గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 11, 2023
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై Google Meet 1080p వీడియో నాణ్యత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు గూగుల్ వర్క్‌స్పేస్ సబ్‌స్క్రైబర్‌ల కోసం గ్రూప్ కాల్‌లను విస్తరించింది. మొదట ఏప్రిల్‌లో ఒకరితో మరొకరు, వన్ టూ వన్ సెషన్‌ కోసం హైక్వాలిటీ గల వీడియో కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పూర్తి HD వెబ్‌క్యామ్‌లు లేదా అంతకంటే మెరుగైన వినియోగదారులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూప్ కాల్‌లో పాల్గొనచ్చని గూగుల్ తెలిపింది. ఇదే సమయంలో మరింత మెరుగైన వీడియో రిజల్యూషన్‌ను 1080pని ఆస్వాదించవచ్చు. ఫీచర్‌ని యాక్టివేట్ చేసేందుకు, యూజర్‌లు ముందుగా జాయిన్ స్క్రీన్‌పై కనిపించే ప్రాంప్ట్‌ను ఆమోదించాలి.

details

వ్యక్తిగత వినియోగదారులకు అందుబాటులోకి రాని సౌకర్యం

ఈ క్రమంలోనే వీడియో విండోలో 1080p లేబుల్ కనిపిస్తుంది. ఆపై దాని క్రియాశీలతను నిర్ధారిస్తుంది. మెరుగైన వీడియో రిజల్యూషన్ సెట్టింగ్‌లు, ఆటో-అడ్జస్ట్‌మెంట్ లో భాగంగా సెట్టింగ్‌లు >వీడియో కింద అధిక నాణ్యత వీడియో కోసం సెట్టింగ్‌లను మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 1080p వీడియో రిజల్యూషన్, హై-రిజల్యూషన్ వీడియో ఫీడ్‌ కోసం పెద్ద స్క్రీన్‌పై 1080p ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది వినియోగదారులు పిన్ చేసినప్పుడే పంపేందుకు వీలవుతుంది. నెట్‌వర్క్ బ్యాండ్‌విడ్త్ పరిమితమైతే, యాప్ స్వయం చాలకంగా వీడియో రిజల్యూషన్‌ను సర్దుబాటు చేస్తుంది. ముఖ్యంగా, ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే, వ్యక్తిగత Google ఖాతాలు ఉన్న వినియోగదారులకు ఇంకా అందుబాటులో రాలేదు.