
Google One Lite Plan: భారతదేశంలో గూగుల్ వన్ లైట్ ప్లాన్ పేరుతో కొత్త సేవలు.. నెల పాటు ఉచితం
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ వన్ ఇప్పుడు అదనపు స్టోరేజ్ కోసం కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది.
క్లౌడ్ స్టోరేజ్ రంగంలో పోటీ తీవ్రంగా ఉన్న ఈ సమయంలో, తక్కువ ధరలో స్టోరేజ్ అందించడానికి ఈ కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.
'గూగుల్ వన్ లైట్ ప్లాన్' పేరుతో, గూగుల్ వినియోగదారులకు 30 జీబీ స్టోరేజ్‌ను తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించింది.
గూగుల్ వన్ లైట్ ప్లాన్ ధర నెలకు రూ.59 కాగా,30జీబీ అదనపు స్టోరేజ్ అందిస్తుంది.బేసిక్ ప్లాన్ కింద 100 జీబీ స్టోరేజ్ పొందాలంటే,నెలకు రూ.130 చెల్లించాలి.
మొదటి నెల ఈ ప్లాన్‌లు ఉచితంగా లభిస్తాయి, ఆ తరువాత ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సభ్యత్వం తీసుకుంటే, రూ.589 ధరగా ఉంటుందని గూగుల్ ప్రకటించింది.
వివరాలు
ప్లాన్‌లో ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లు
గూగుల్ వన్ లైట్ ఏఐ ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.1,950. ఈ ప్లాన్‌లో ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉండవు.
అయితే, 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ యాప్‌లతో అనుసంధానం, జెమిని యాక్సెస్, మ్యూజిక్ ఎడిటర్ వంటి ఫీచర్లు అందుతాయి.
గూగుల్ ఈ ప్లాన్‌పై కూడా ఒక్క నెల పాటు ఉచిత ట్రయల్ అందిస్తోంది. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది, అయితే దశలవారీగా అందరికీ అందించనుంది.
వివరాలు
వెల్‌కమ్ ఆఫర్‌లో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం
ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఆపిల్ వినియోగదారులు స్టోరేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా, ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ఉచితంగా అందిస్తున్న 15 జీబీ స్టోరేజ్ పరిమితికి చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వారు అదనపు స్టోరేజ్ కోసం వివిధ వేదికలను వెతుకుతున్నారు.
రిలయన్స్ జియో కూడా తమ వెల్‌కమ్ ఆఫర్‌లో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందించనుంది.
అధిక స్టోరేజ్ కోసం తక్కువ ధరలో ప్లాన్‌లను తీసుకురానున్నట్లు జియో ప్రకటించడంతో పోటీ మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో గూగుల్ తక్కువ ధరల్లో క్లౌడ్ స్టోరేజ్‌ను అందించడానికి వన్ లైట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.