Google Photos Recap: గూగుల్ ఫోటోస్ 2024 రిక్యాప్.. ఆందమైన జ్ఞాపకాలకు కొత్త ఫీచర్
2024 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ ఫోటోస్ యాప్‌లో వినియోగదారులు తమ జ్ఞాపకాలను తిరిగి అనుభవించడానికి కొత్తగా 2024 రిక్యాప్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారుల ఫోటో కలెక్షన్స్ నుంచి ముఖ్యమైన ఫోటోలు, ఈవెంట్లను ప్రదర్శిస్తూ వాటికి గ్రాఫిక్స్, సినిమాటిక్ ఎఫెక్ట్స్, ప్రత్యేకమైన సమాచారాన్ని జతచేస్తుంది. గూగుల్ ప్రకారం 2024 రిక్యాప్ అనేది గూగుల్ ఫోటోస్ యాప్‌లోని జ్ఞాపకాల సేకరణ. ఇందులో ఉపయోగించిన ఫోటోలు, వీడియోలు ప్రత్యేక గ్రాఫిక్స్, సినిమాటిక్ ఎఫెక్ట్స్‌తో కలిపి ప్రదర్శిస్తాయి. అదనంగా వినియోగదారుల ఫోటోల్లోని డేటా ఆధారంగా ఆసక్తికరమైన గణాంకాలు, వ్యక్తిగత విశ్లేషణలను అందిస్తుంది.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్
2024 రిక్యాప్ ఫీచర్ వినియోగదారుల ముఖ్యమైన స్మృతులను గుర్తుచేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఫీచర్‌లో ముఖ్యమైన ప్రయాణాలు, వ్యక్తిగత మైలురాళ్లు, ఈవెంట్లు వంటి అంశాలను హైలైట్ చేస్తుంది. అమెరికాలోని వినియోగదారులకు, గూగుల్ జెమినీ AI మోడల్ ద్వారా 2024 రిక్యాప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశముంది. ఈ క్యాప్షన్లు వ్యక్తిగత జ్ఞాపకాలను హైలైట్ చేస్తూ వినియోగదారుల అనుభవాన్ని మరింత ప్రత్యేకతను చేకూరుస్తాయి. 2024 రిక్యాప్ ద్వారా గూగుల్, వినియోగదారులకు తమ జ్ఞాపకాలను తిరిగి అనుభవించడానికి కొత్త మార్గాన్ని అందిస్తోంది.