LOADING...
Google Photos 2025 Recap: గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్  ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్
గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్  ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్

Google Photos 2025 Recap: గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్  ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ ఫోటోస్ తాజాగా 2025 రీక్యాప్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు తమ ఫోటోలు,వీడియోలతో తయారైన పర్సనలైజ్డ్ హైలైట్ వీడియో ద్వారా ఈ ఏడాది జ్ఞాపకాలను మళ్లీ చూసుకోవచ్చు. గతేడాది వెర్షన్‌తో పోలిస్తే ఈసారి మరిన్ని స్మార్ట్ ఇన్‌సైట్స్‌, కొత్త ఎడిటింగ్ ఆప్షన్లు, సులభమైన షేరింగ్ టూల్స్‌ను జోడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్లు ఎంచుకున్న యూజర్లకే మాత్రమే లభిస్తాయి ఈ ఏడాది రీక్యాప్‌లో సెల్ఫీ కౌంట్‌తో పాటు టాప్ పీపుల్, మొత్తం ఫోటోలు వంటి వివరాలు చూపిస్తారు.

వివరాలు 

బెస్ట్ మూవ్‌మెంట్స్‌గా  ఏడాది పొడవునా చేసిన యాక్టివిటీలు 

అమెరికాలోని యూజర్లకు Gemini ఆధారంగా హాబీలకు సంబంధించిన ఇన్‌సైట్స్‌ను కూడా అందిస్తున్నారు. ఇవి యూజర్లు ఏడాది పొడవునా చేసిన యాక్టివిటీలను, బెస్ట్ మూవ్‌మెంట్స్‌ను గుర్తిస్తాయి. రీక్యాప్‌లో చూపించకూడని వ్యక్తులు లేదా ఫోటోలను దాచేసి కొత్త రీక్యాప్‌ను వెంటనే జనరేట్ చేసుకునే వెసులుబాటును గూగుల్ కల్పించింది. అలాగే CapCut‌తో కలిసి ప్రత్యేక ఎడిటింగ్ టెంప్లేట్స్ తీసుకొచ్చారు. "Edit with CapCut" ఆప్షన్‌తో క్రియేటివ్ ఎఫెక్ట్స్ వేసుకుని రీక్యాప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ యాప్‌లోని Memories కారసెల్‌లో ఈ 2025 రీక్యాప్ కనిపిస్తుంది.

వివరాలు 

వీడియోలు, కోలాజ్‌లను మెసేజింగ్ యాప్స్‌లో షేర్ చేయొచ్చు

ఎక్కువ మంది యూజర్లకు ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్ వస్తుంది. రిక్యాప్ కనిపించకపోతే, యూజర్ మాన్యువల్‌గా రిక్వెస్ట్ చేయగలుగుతారు. సిస్టమ్ ఆ సంవత్సరానికి సరిపడిన ఫోటోలు, వీడియోలు గుర్తించిన తర్వాత ఆ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది. ఒకసారి రీక్యాప్ జనరేట్ అయిన తర్వాత డిసెంబర్ నెల మొత్తం Collections ట్యాబ్‌లో పిన్ అయి ఉంటుంది. షేరింగ్ కోసం చిన్న వీడియోలు, కోలాజ్‌లను ఆటోమేటిక్‌గా రెడీ చేస్తారు. వాటిని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో షేర్ చేయొచ్చు. తాజాగా వాట్సాప్ స్టేటస్ కు డైరెక్ట్‌గా షేర్ చేసే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చారు. దీనితో అదనపు ఎడిటింగ్ అవసరం లేకుండానే రీక్యాప్‌ను సులభంగా పంచుకోవచ్చు.

Advertisement