
Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్..AI సహాయంతో మీకు కావాల్సినట్లు ఫోటోలు ఎడిట్ చెయ్యచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ ఇటీవల తన Google Photos యాప్‌లో కొత్త "edit by asking" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు,కేవలం అడిగితే సరిపోతుంది. ఈ ఫీచర్ మొదట అమెరికాలో Pixel 10 డివైస్‌లలో అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులు వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా స్పష్టమైన ఎడిట్స్ ను అడగొచ్చు. ఈ ఫీచర్ తో ఫోటో ఎడిటింగ్ ఇప్పుడు మరింత సులభమవుతుంది.
వివరాలు
Google వినియోగదారులకు సరదా ఐడియాలు ఇచ్చే "edit by asking"
ఈ కొత్త ఫీచర్ Gemini టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఉదాహరణకు,"బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కార్లను తీసివేయి" లేదా "ఈ పాత ఫోటోను రిస్టోర్ చేయి" అని చెప్పితే Google Photos ఆ పని చేసేస్తుంది. ఇది టెక్నాలజీ అంటే తెలియనివారికి,లేదా ఎడిటింగ్ టూల్స్ లో లోతైన అవగాహన లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. "edit by asking" ఫీచర్ సాధారణ లైటింగ్ సర్దుబాటు నుండి కాంప్లెక్స్ ఎడిట్స్ వరకు చేయగలదు. ఉదాహరణకు బ్యాక్‌గ్రౌండ్ మార్చడం,ఫోటోలో కొత్త ఎలిమెంట్స్ జోడించడం. Google వినియోగదారులకు సరదా ఐడియాలు కూడా ఇస్తుంది. ఉదాహరణకు ఫోటోలో ఉన్నసబ్జెక్ట్‌కు సన్‌గ్లాసెస్ లేదా పార్టీ హ్యాట్ వేయమని ఐడియా ఇస్తుంది.
వివరాలు
Google Photosలో C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్
ఎడిటింగ్ గురించి ఖచ్చితంగా తెలియకపోతే, "ఇది బెటర్ చేయి" వంటి సాధారణ అభ్యర్థనతో ప్రారంభించి, Google Photos ఆటోమేటిక్‌గా మార్పులు చేస్తుంది. కొత్త ఫీచర్‌తో పాటు, Google Photosలో C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్ కూడా జోడించింది. ఈ స్టాండర్డ్ ఫోటోలు ఎలా తయారయ్యాయో, అవి AI ఉపయోగించాయా లేదా అనే విషయాల్లో స్పష్టత ఇస్తుంది. Pixel డివైస్‌లలోAI లేకపోయినా C2PA కెమెరా యాప్,అది తీసిన ఫోటోలతో పనిచేస్తుందని Google తెలిపింది. మొదట Pixel 10 డివైస్‌లలో ఈ సపోర్ట్ అందుతుంది, తరువాత iOS, ఇతర Android డివైస్‌లకు ఈ సపోర్ట్ లభిస్తుంది.