LOADING...
Google Pixel 10 series: ఇండియాలో లాంచైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవే..
ఇండియాలో లాంచైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవే..

Google Pixel 10 series: ఇండియాలో లాంచైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
11:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన తాజా పిక్సెల్ 10 సిరీస్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. కొత్త సిరీస్‌లో నాలుగు ఫోన్లు ఉన్నాయి: స్టాండర్డ్ పిక్సెల్ 10, హై-ఎండ్ పిక్సెల్ 10 ప్రో, పెద్ద డిస్‌ప్లే కలిగిన పిక్సెల్ 10 ప్రో XL, ఫోల్డబుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. ఈ ఫోన్లు అన్ని గూగుల్ జెమిని టెక్నాలజీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్, అప్‌గ్రేడెడ్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తాయి, తద్వారా పనితీరు మరింత మెరుగవుతుంది.

వివరాలు 

డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ

పిక్సెల్ 10 సిరీస్‌లో చిన్న,పెద్ద డివైసులు రెండు రకాలుగా ఉన్నాయి. స్టాండర్డ్, ప్రో మోడల్‌లకు 6.3 అంగుళాల స్క్రీన్ ఉంది. 10 ప్రో XL లో 6.8 అంగుళాల డిస్‌ప్లే, ప్రో ఫోల్డ్ వేరియంట్‌లో 8 అంగుళాల ఇంటర్ స్క్రీన్, 6.4 అంగుళాల అవుటర్ స్క్రీన్ ఉంది. అన్ని మోడల్‌లా Corning Gorilla Glass Victus 2 పొర, 120Hz రిఫ్రెష్ రేట్, IP68 రేటింగ్‌తో వస్తాయి, కాబట్టి మట్టి, నీరు నుండి రక్షణ ఉంటుంది.

వివరాలు 

AI ఫీచర్స్, టెన్సర్ G5 చిప్‌సెట్

పిక్సెల్ 10 సిరీస్‌లో యూనిక్ AI ఫీచర్స్ ఉన్నాయి,వాటిలో మాజిక్ క్యూ, కాల్‌లలో లైవ్ ట్రాన్స్లేట్, కెమెరా కోచ్ ఉన్నాయి. అన్ని ఫోన్లు కొత్త టెన్సర్ G5 (4nm) చిప్‌సెట్‌తో వస్తాయి, ఇది గత మోడల్ కంటే పెద్ద అప్గ్రేడ్ అని గూగుల్ పేర్కొంది. ఈ చిప్ TPU (Tensor Processing Unit) 60% వేగంగా ఉందని, CPU కోర్స్ 34% వేగంగా ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ఫోన్లు Android 16 OS పై నడుస్తాయి, ఏడు ప్రధాన OS అప్‌డేట్‌ల వరకు మద్దతు ఇస్తాయి.

వివరాలు 

పిక్సెల్ 10 సిరీస్ కెమెరా సిస్టమ్

పిక్సెల్ 10 లో 48MP (OIS) మైన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్, 10.8MP (OIS) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పిక్సెల్ 10 ప్రో, ప్రో XL లో 50MP (OIS) మైన్, 48MP అల్ట్రా-వైడ్, 48MP (OIS) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 48MP (OIS) మైన్, 10.5MP అల్ట్రా-వైడ్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి,అలాగే ఇంటర్, అవుటర్ స్క్రీన్‌లకు 10MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అన్ని ఫోన్లలో టెలిఫోటో లెన్స్ ద్వారా 5x ఆప్టికల్ జూమ్ మద్దతు ఉంది.

వివరాలు 

ధరలు

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధరలను పిక్సెల్ 9 సిరీస్‌తో సమానంగా ఉంచింది. స్టాండర్డ్ మోడల్ ధర ₹79,999, ప్రో వేరియంట్ ₹1,09,999. పెద్ద ప్రో XL ₹1,24,999 నుంచి ప్రారంభం, ఫోల్డబుల్ ప్రో ఫోల్డ్ ధర భారత్ లో ₹1,72,999. అన్ని మోడల్‌లకు ఒక ఏడాది గూగుల్ AI ప్రో ప్లాన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందుతుంది.