Google Pixel: పిక్సెల్ ఫోన్లలో 911 కాల్ సమస్య.. వినియోగదారుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను మరోసారి బగ్ సమస్య వేధిస్తోంది. అత్యవసర సేవలైన 911కు కాల్ చేయడానికి వీలు లేకుండా చేస్తున్న ఈ లోపం వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అమెరికాలోని పిక్సెల్ 8, పిక్సెల్ 9, పిక్సెల్ 10 ఫోన్ యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా AT&T వంటి పెద్ద నెట్‌వర్క్‌ల వినియోగదారులు కూడా ఇదే ఇబ్బంది గురిస్తున్నారని చెబుతున్నారు. ఇంత కీలకమైన సమస్య అయినా ఇప్పటివరకు గూగుల్ దానిపై స్పష్టమైన పరిష్కారం చూపలేదు. సెప్టెంబర్ నెలలో కూడా ఈ బగ్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి.
ప్రభావం
పిక్సెల్ ఫోన్లలో 911 కాల్ సమస్య.. వినియోగదారుల ఆందోళన
పిక్సెల్ ఫోన్ల వినియోగదారులు అత్యవసర సేవల కోసం 911కి కాల్ చేయలేకపోతున్నారని నివేదిస్తున్నారు. ఈ బగ్ తీవ్రత వినియోగదారుల అనుభవాల ద్వారానే స్పష్టమవుతోంది. ఒక పిక్సెల్ 8 యజమాని, బలమైన మొబైల్ సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఉన్నప్పటికీ, వైఫై కాలింగ్ ఆన్ చేయకపోతే కాల్ వెళ్లడం లేదని, ఫలితంగా 10 నిమిషాల పాటు 911కి కనెక్ట్ కావడానికి ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అదే సమయంలో మరో ఫోన్ ద్వారా 911కి సులభంగా కాల్ చేయగలిగారు. దీంతో సమస్య పిక్సెల్ ఫోన్లకే పరిమితమని తేలింది.
క్యారియర్ హెచ్చరిక
కెనడాలో బెల్ క్యారియర్ అత్యవసర హెచ్చరిక జారీ
కెనడా టెలికం సంస్థ బెల్, పిక్సెల్ 6 నుండి 10 వరకు ఉన్న మోడళ్ల వినియోగదారులకు గురువారం అత్యవసర హెచ్చరిక పంపింది. 911 కాల్‌లలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ హెచ్చరిక, పలు వినియోగదారులు చేసిన విఫల కాల్ రిపోర్టుల తరువాత వచ్చింది. అయితే అమెరికాలోని ప్రధాన క్యారియర్లు ఇప్పటివరకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు, అయితే అక్కడ కూడా పిక్సెల్ యూజర్లలో ఇదే సమస్య విస్తృతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆందోళన
గూగుల్ స్పందించకపోవడం ఆందోళనకరం
ఈ సమస్యపై గూగుల్ లేదా అమెరికా క్యారియర్లు ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం వినియోగదారుల ఆందోళనకు కారణమవుతోంది. అత్యవసర సేవలకు సమయానికి కాల్ చేయలేని పరిస్థితి గంభీర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా పిక్సెల్ ఫోన్‌లతో 911 కాలింగ్‌కు సంబంధించి ఇలాంటి సమస్యలు పలు సార్లు బయటపడ్డాయని సమాచారం.