LOADING...
Google Pixel: గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు
గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు

Google Pixel: గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా "నోటిఫికేషన్ సమ్మరీలు" అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ జాగ్రత్తగా కేవలం చాట్ సంభాషణలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అప్‌డేట్ పిక్సెల్ 9 సిరీస్, కొత్త మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, అయితే పిక్సెల్ 9A దీనికి మినహాయింపు.

ఫీచర్ వివరాలు 

చాట్ యాప్‌లకే పరిమితమైన నోటిఫికేషన్ సమ్మరీలు 

ఈ ఫీచర్ మొదటిసారిగా Android Authorityకి చెందిన మిషాల్ రెహ్మాన్ Android 16 బీటాలో గుర్తించారు. ప్రస్తుతం ఇది చాట్ యాప్‌లు, పొడవైన సంభాషణలకు మాత్రమే పనిచేస్తోంది. దీని ద్వారా సిస్టమ్‌కి కాంటెక్స్ట్ ఎక్కువగా దొరుకుతుంది, తద్వారా యాపిల్‌లో ఉన్నట్లుగా తప్పులు తక్కువగా వస్తాయి. గూగుల్ తెలిపినట్లు, డిసెంబర్ అప్‌డేట్‌లో నోటిఫికేషన్‌లను ఆటోమేటిక్‌గా వర్గీకరించి, తక్కువ ప్రాధాన్యత ఉన్నవి సైలెంట్ చేస్తుంది.

ఫీచర్ విస్తరణ 

మోసపూరిత సందేశాల గుర్తింపు.. థర్డ్ పార్టీ యాప్‌లలో కూడా 

ఇప్పటివరకు పిక్సెల్ మెసేజ్‌లలో మాత్రమే ఉన్న స్కామ్ డిటెక్షన్ ఫీచర్, ఇప్పుడు టెలిగ్రామ్, డిస్కార్డ్ వంటి థర్డ్ పార్టీ చాట్ యాప్‌లలో కూడా పనిచేయనుంది. పిక్సెల్ 6 లేదా అంతకంటే కొత్త మోడల్‌ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మోసపూరిత సందేశం గుర్తించినప్పుడు "లైక్లీ స్కామ్" అనే బ్యాడ్జ్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే, యూజర్‌కి జాగ్రత్త సూచన చూపించే సిస్టమ్‌ పాప్‌అప్ వస్తుంది.

ఫీచర్ విస్తరణ 

ఇతర ముఖ్యమైన అప్‌డేట్‌లు 

పిక్సెల్ 9 యూజర్లకు యూకే, ఐర్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో కాల్ స్కామ్ డిటెక్షన్ ఫీచర్ విస్తరించబడింది. అలాగే అమెరికా యూజర్ల కోసం VIP విడ్జెట్‌లో క్రైసిస్ బ్యాడ్జ్ను గూగుల్ తీసుకొచ్చింది. ఇది వరదలు వంటి అత్యవసర పరిస్థితులపై అలర్ట్‌లు ఇస్తుంది.

యాప్ అప్‌డేట్‌లు 

గూగుల్ మ్యాప్స్‌కి కొత్త పవర్ సేవింగ్ మోడ్ 

అప్‌డేట్‌లో భాగంగా అమెరికా యూజర్లకు గూగుల్ ఫోటోస్‌లో పర్సనలైజ్డ్ ఎడిట్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అలాగే గూగుల్ మ్యాప్స్‌కి కొత్త పవర్ సేవింగ్ మోడ్ను జోడించారు. ఇది అవసరమైన సమాచారమే చూపిస్తూ, బ్యాటరీని ఆదా చేస్తుంది. అదనంగా, యూజర్లు తమ పిక్సెల్‌ను "Wicked: For Good" సినిమా థీమ్ ప్యాక్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు.