
Google: ఓపెన్ఏఐ GPT-5 ను ఎదుర్కోవడానికి జెమిని 3 AI ని సిద్ధం చేస్తున్న గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ "జెమినై 3" ను ప్రాథమికంగా పరీక్షలలో ప్రవేశపెట్టినట్టు సమాచారం. కంపెనీ AI స్టూడియోలో ఈ మోడల్ ను టెస్ట్ చేస్తున్న కొద్దిరోజుల్లోనే, డెవలపర్లు సోషల్ మీడియా ద్వారా స్క్రీన్‌షాట్లు, కోడ్ స్నిప్పెట్లను షేర్ చేశారు. అందులో "ఫ్లాష్-ప్రివ్యూ"వర్షన్ లో కోడింగ్, ఇమేజ్ జెనరేషన్ పనుల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ప్రాథమిక ఫలితాల్లో జెమినై 3 తన ప్రత్యర్థి క్లౌడ్ 4.5 కంటే వేగంగా,సుస్పష్టమైన ఫలితాలు చూపుతుందని రిపోర్ట్ చేశారు. గూగుల్ క్లౌడ్ అధికారిక ఖాతా అక్టోబర్ 9న "#GeminiAtWork" హ్యాష్‌ట్యాగ్ తో ఒక లైవ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో,ఆ రోజున జెమినై 3ను అధికారికంగా పరిచయం చేసేందుకు అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
వివరాలు
AI స్టూడియో,వర్క్‌స్పేస్ టూల్స్ ద్వారా లాంచ్ కి అవకాశం
విశ్లేషకుల ప్రకారం, reasoning, కోడింగ్ ఖచ్చితత్వం, సృజనాత్మకతలో గణనీయమైన మెరుగుదలతో జెమినై 3 2025లో గూగుల్ ప్రధాన AI అప్‌డేట్‌గా నిలుస్తుంది. ఇది ఓపెన్‌ఏఐ GPT-5కు, క్లౌడ్ 4.5కు గూగుల్ ఇచ్చే ప్రత్యామ్నాయం కావచ్చని భావిస్తున్నారు. జెమినై 3 డెవలపర్లకు వేగవంతమైన, సందర్భాన్ని అర్థం చేసుకునే కోడ్ జెనరేషన్, బ్రౌజర్ స్థాయి ఆటోమేషన్ కోసం "ఏజెంట్ మోడ్" వంటి ఫీచర్లను అందించవచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త మోడల్ త్వరలో AI స్టూడియో,వర్క్‌స్పేస్ టూల్స్ ద్వారా లాంచ్ అయ్యే అవకాశముంది.