
Gmail: ఇక AI-ఆధారిత సందర్భోచిత 'స్మార్ట్ సమాధానాలు'.. జీమెయిల్‌లో కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఈ-మెయిల్ సర్వీస్ జీమెయిల్ (Gmail) కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ "స్మార్ట్ రిప్లై" అని పిలుస్తారు. దీంతో సందర్భోచిత సమాధానాలను పంపడంసులభం కానుంది.
సాధారణంగా, మెయిల్స్‌కు రిప్లై ఇచ్చేటప్పుడు జీమెయిల్ కొన్ని సూచనలు చూపిస్తుంది. 2017లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు, దీనికి ఏఐ సాంకేతికతను జోడించడం ద్వారా, సమాధానాలు మరింత స్మార్ట్‌గా మారనుంది.
మీరు సమాధానం పంపాలనుకున్న మెయిల్‌ను ఓపెన్ చేసి, "రిప్లై" పై క్లిక్ చేస్తే, కింద వివిధ సజెషన్లు మీకు కనిపిస్తాయి.
ఈ ఏఐ టెక్నాలజీ మెయిల్‌లోని సమాచారాన్ని అర్థం చేసుకొని, సందర్భానికి అనుగుణంగా సమాధానాలను రూపొందిస్తుంది.
వివరాలు
ఏఐ సాంకేతికతతో అనేక సజెషన్లు
అర్థవంతమైన, స్మార్ట్, సరైన ముగింపుతో కూడిన సమాధానాలను చూపించి, మీకు ఇస్తుంది. మీరు నచ్చిన సమాధానాన్ని ఎంచుకొని, ప్రివ్యూ చెయ్యవచ్చు. ఏవైనా మార్పులు అవసరమైతే, సులభంగా ఎడిట్ చేసి పంపవచ్చు.
ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ పరికరాలకు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇది గూగుల్ వన్ ఏఐ ప్రీమియంతో పాటు కొన్ని ప్రత్యేక యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ జీమెయిల్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.