AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్
గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్‌బాట్ ChatGPT సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ Bard అనే ప్రయోగాత్మక AI సేవ, LaMDA (డైలాగ్ అప్లికేషన్ ఫర్ లాంగ్వేజ్ మోడల్) ద్వారా అందించబడుతుంది. ఇది ప్రశ్నలకు సరైన జవాబులను అందించడానికి వెబ్ నుండి సమాచారాన్ని తీసుకుంటుంది. గూగుల్ చాట్‌బాట్ అంతరిక్ష ఆవిష్కరణల వంటి సంక్లిష్ట విషయాలను పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పగలదు. LaMDAను గూగుల్ 2021లో అభివృద్ధి చేసి, విడుదల చేసింది. Google CEO సుందర్ పిచాయ్ కంపెనీ మొదట Bardను LaMDA ద్వారా లైట్ వెయిట్ వెర్షన్‌లో విడుదల చేస్తామని తెలిపారు.