Anthropic: ఆంథ్రోపిక్‌లో గూగుల్ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. 40 బిలియన్ డాలర్ల డీల్
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ స్టార్టప్ సంస్థ 'ఆంత్రోపిక్' లో టెక్ దిగ్గజం గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మొత్తం 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను రూపొందించినట్లు ఆంథ్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో 10 బిలియన్ డాలర్లను గూగుల్ ఆంథ్రోపిక్‌లో పెట్టనుంది. మిగిలిన 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి సంస్థ పనితీరుపై ఆధారపడి దశలవారీగా విడుదల అవుతుంది. ఇక ఇదే సమయంలో అమెజాన్ కూడా ఆంథ్రోపిక్‌తో తన భాగస్వామ్యాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది.
వివరాలు
సాంకేతిక సామర్థ్యాలను విస్తరించనున్న ఆంథ్రోపిక్
ప్రారంభంగా 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, పనితీరు లక్ష్యాలు చేరుకుంటే మరో 20 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ పరిణామాల మధ్య గూగుల్-ఆంథ్రోపిక్ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు కంపెనీల మధ్య ఉన్న భాగస్వామ్యం ఈ డీల్‌తో మరింత బలపడనుంది. గూగుల్‌కు చెందిన కస్టమ్ చిప్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను వినియోగించుకుని ఆంథ్రోపిక్ తన సాంకేతిక సామర్థ్యాలను మరింత విస్తరించనుంది.