Google: గూగుల్‌కు భారీ బూస్ట్.. 35 కోట్ల సబ్‌స్క్రిప్షన్లు.. దూసుకెళ్తున్న యూట్యూబ్,గూగుల్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.5కోట్ల కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్లు చేరడంతో మొత్తం సంఖ్య 35 కోట్లకు పెరిగింది. ఈ వివరాలను మాతృసంస్థ Alphabet Inc.తన Q1 ఫలితాల్లో వెల్లడించింది. గత త్రైమాసికంలో 32.5 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు భారీగా పెరగడం గమనార్హం. ముఖ్యంగా యూట్యూబ్,గూగుల్ వన్ సేవలే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే జెమినీ వినియోగదారుల వివరాలు మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. కానీ గూగుల్ వన్ ప్లాన్‌లతో జెమినీ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందుబాటులోకి రావడంతో వాటి వినియోగం కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ విభాగంలో జెమినీకి మంచి డిమాండ్ ఉందని గూగుల్ తెలిపింది.
వివరాలు
పెరుగుతున్న యూజర్ల సంఖ్య
ఈ సేవకు సంబంధించిన నెలవారీ చెల్లింపు యూజర్ల సంఖ్య ప్రతి త్రైమాసికం 40 శాతం చొప్పున పెరుగుతోందని కంపెనీ తెలిపింది. ఇక మరోవైపు యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్లు పెరుగుతున్నప్పటికీ, ప్రకటనల ఆదాయం మాత్రం అంచనాలకు తగ్గకుండా ఉండటం గమనార్హం. గతంలోనే సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai)యూట్యూబ్‌ను కేవలం యాడ్స్ ఆధారంగా కాకుండా సబ్‌స్క్రిప్షన్లతో కలిపి చూడాలని సూచించారు. వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియం వైపు మళ్లితే ప్రకటనల ఆదాయం తగ్గుతుందని కూడా పేర్కొన్నారు.
వివరాలు
యాడ్స్ ద్వారా 9.9 బిలియన్ డాలర్లు
గత ఏడాది యూట్యూబ్ మొత్తం ఆదాయం 60 బిలియన్ డాలర్లను దాటగా, 2025 నాలుగో త్రైమాసికంలో యాడ్స్ ద్వారా 11.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే ఈసారి 9.9 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11% వృద్ధి అయినప్పటికీ, మార్కెట్ అంచనాలకు తక్కువగానే ఉంది. దీని ద్వారా యూజర్లు అడ్స్ లేకుండా చూడడానికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.