Google Pixel 11: ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. ఏం కొత్తగా రానుంది?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన తదుపరి 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ కొత్త పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించనుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 12న సాయంత్రం 6 గంటలకు (ఈస్టర్న్ టైమ్) ఈ ఈవెంట్ జరగనుంది. గత ఏడాది విడుదలైన పిక్సెల్ 10 సిరీస్‌తో పోలిస్తే ఈసారి ఈవెంట్ వారం రోజుల ముందుగానే నిర్వహించనుండగా,సాధారణంగా మధ్యాహ్నం జరిగే గూగుల్ కార్యక్రమాలకు భిన్నంగా సాయంత్రం వేళను ఎంచుకుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వాన చిత్రంలో బంగారు రంగు ఫినిష్‌తో,అడ్డంగా ఉండే కెమెరా విజర్ కలిగిన ఫోన్‌ను చూపించింది. దీంతో అది పిక్సెల్ 11 సిరీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ అనే విషయం దాదాపు ఖరారైంది.
వివరాలు
ధర కూడా కొంత పెరిగే అవకాశం
ఈ కొత్త సిరీస్‌లో బేస్ వేరియంట్ కూడా 128GBకు బదులుగా 256GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే, గత మోడల్‌తో పోలిస్తే ధర కూడా కొంత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు, గూగుల్ ఇప్పటికే ఇతర పరికరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన 'గ్లో' లైట్ ఫీచర్‌ను కూడా పిక్సెల్ 11 సిరీస్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని ప్రచారం సాగుతోంది. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా, ఈ ఫీచర్ కొత్త ఫోన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
కృత్రిమ మేధ (AI) ఆధారిత కొత్త ఫీచర్లు
గత ఏడాది నిర్వహించిన 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత జిమ్మీ ఫాలన్ ఆతిథ్యం వహించగా, స్టీఫెన్ కరీ, జోనాస్ బ్రదర్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌తో పాటు ఇప్పటికే ఉన్న పరికరాలకు కృత్రిమ మేధ (AI) ఆధారిత కొత్త ఫీచర్లను ప్రకటించింది. అలాగే కొత్త ఫోల్డబుల్ ఫోన్, పిక్సెల్ వాచ్ 4, రెండో తరం తక్కువ ధర A-సిరీస్ ఇయర్‌బడ్స్‌ను కూడా ఆవిష్కరించింది.